ఏడుపాయల వనదుర్గమ్మ విశిష్టత

ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయ చరిత్ర

శ్రీ వేదవ్యాస వశిష్ట వాల్మికి సైనిక బృగాది మహార్శుల నివాసయో గ్యమైన నైనిశారణ్యం పోలిన గొప్పదండకారణ్యం, ద్వాపర యుగంలో అర్జునుడి కుమారుడైన పరిక్షిత్‌రాజు వేట కోసం ఏడు పాయల వనదుర్గాభవాని ఆలయ ప్రాం తానికి రాగా దాహం వేసింది. సమీపంలోని ఋషి ఆశ్రమానికి వెళ్ళగా తపోధ్యానంలో నిమగ్నమై ఉన్న ఓ ముని కనపడ్డాడు. పరిక్షిత్‌రాజు దాహం తీర్చ మని ఆ మునిని కోరగా కఠోర తపస్సులో ఉన్న ముని గమనించ లేదు. ఎన్నిసార్లు అడిగిన ముని కదలకపోవడంతో కోపం వచ్చిన పరిక్షిత్‌రాజు అవమానంగా భావించి సమీపంలో చనిపోయి పడిఉన్న పాము ను తీసి ముని మెడలో వేసి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపో యాడు. కొంత సేపటికి కళ్ళు తెరిచిన ముని కుమారుడు తన తండ్రి మెడలో చనిపోయి ఉన్న పామును చూసి ఈ తుంటరి పనిచేసిన వారు పాము కాటుతోనే మరణిస్తాడని శపించారు. దీంతో పరిక్షిత్ మహారాజు పాము కాటుతో మరణిస్తాడు. అనంత రం పరిక్షిత్‌రాజు కుమారుడు జనమేజయుడు తన తండ్రిని చంపిన పాములపై పగ తీర్చుకోవడానికి సర్పయాగం చేస్తాడు. సర్పజాతి హితమహుడైన సర్పయాగం ఆపడానికి వాసుకి కోరిక మేరకు శ్రీ వనదుర్గాభవాని అమ్మవారి స్వయంబుగా అవతరించి మంజీరా (గరుఢ గంగా) నదిని పాతలతో స్పృశించగా ఏడుపాయలుగా చీలి యాగం నుండి వచ్చే అగ్నిజాలలను చల్లార్చి సర్పజాతీ వినాశనం కాకుండా కాపా డింది. ఇప్పటికి ఈ ప్రాంత గుహల్లో తవ్వినప్పుడు గతంలో యాగం చేసిన బూడిద (బస్మం) లభ్యమవుతుంది.

Edupayala-Jatara

ప్రకృతి అందాలకు నిలువెత్తు చోటు : ఏడుపాయలకు వచ్చే భక్తులకు శ్రీ వనదుర్గాభవాని అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ప్రకృతి అందాలకు నెలవైన ఏడుపాయల ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఆకుట్టుకునే విధంగా పేరుంది. ఏడుపాయలుగా చీలిన మంజీరానదిలో మధ్యలో రాతి గుహలో వనదుర్గాభవానిమాత రూపంలో వెలసిన పుణ్యక్షేత్రం. గల గల పారే మంజీరా నదిలో పాయలలో ఎటు చూసినా ప్రకృతి అందాలతో కనిపించే పచ్చని చెట్లు, ఎత్తైన బండరాళ్లతో, రాతి గుహలతో ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం సందర్శకుల రాక పెరిగిన నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన సౌకర్యాలను దేవస్థాన కార్యనిర్వహణ అధికారి టి. మోహన్‌రెడ్డి కల్పిస్తున్నారు.

జాతర ఉత్సవాలు : ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి జాతర ఉత్సవాలను వారం రోజుల పాటు జానపదుల జాతరగా ఘనంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన భక్తులు జాగరణ చేసి వన దుర్గాభవానిమాతను దర్శించుకోవడంతో జానపదుల జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతరలో కనులపండుగగా నిర్వహించే బండ్లు తిప్పడం, మరుసటి రోజు నిర్వహించే రథోత్సవానికి మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ముఖ్యంగా ఈ జానపద జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు బోనాలు, శివసత్తుల మేనాలు, పోతరాజుల నృత్యాలు జాతర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. ఏడుపాయల్లో సత్రాలు దొరకకపోవడంతో వారు తెచ్చుకున్న చీరలతో, డేరాలతో, ప్లాస్టిక్ కాగితాలతో వెంట తెచ్చుకున్న వాహనాలను కూడా నివాస గూడారులుగా ఏర్పాటు చేసుకుంటారు.

వర్షాకాలంలో అమ్మవారి దర్శనం : వర్షాకాలంలో వర్షాలు బాగా పడడంతో సింగూరు ప్రాజెక్టు నుండి నీరు విడుదల చేయడంతో మంజీరా నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. దీంతో ఘనపురం ఆనకట్టు ఉప్పొంగి పొర్లడంతో ఏడుపాయలు నిండుగా పారి అమ్మవారి ఆలయం జలదిగ్భందం లో ఉంటుంది. అమ్మవారిని దర్శనం చేసుకునే వీలులేకపోవడంతో ప్రధా న రాజగోపురం వద్ద ఆలయ నిర్వాహకులు ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేస్తారు. వచ్చే భక్తులకు రాజగోపురం వద్దే ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులు తీర్థప్రసాదాలను అందజేస్తారు.
రవాణ సౌకర్యం : ఏడుపాయల వన దుర్గాభవాని పుణ్యక్షేత్రానికి చేరుకోవడానికి హైదరాబాద్ నుండి 110 కిలోమీటర్లు, మెదక్ నుండి 18 కిలోమీటర్లు, సంగారెడ్డి నుండి 70 కిలోమీటర్లు ఉంటుంది. ప్రతి రోజు మెదక్ బస్సు డిపో నుండి 45 నిమిషాలకు ఒక బస్సును ఆర్టీసీ నడుపుతుంది. మెదక్ – బోడ్మట్‌పల్లి జాతీయ రహదారి నుండి ఏడుపాయలకు 7 కిలోమీటర్లు, అక్కడి నుండి ఆటోలు వివిధ వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.

ఏడుపాయల అభివృద్ధికి చర్యలు : ఈవో పి.మోహన్‌రెడ్డి

ఏడుపాయలకు వచ్చే భక్తులు సేదతీరడానికి, విందులు చేసుకోవడానికి 44 సత్రాలు ఉన్నాయి. భక్తుల సౌకర్యం దృష్టా కొత్తగా కాటేజీలు నిర్మించనున్నాం. టూరిజం శాఖ ఏర్పాటు చేసిన హరిత హోటల్ భక్తులకు అందుబాటులో ఉంది. దాతల సహాయంతో పెద్ద మొత్తం సత్రాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయనున్నాం. తాగునీటి సౌకర్యంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి పి.మోహన్ రెడ్డి తెలిపారు.

 అంతు నర్సింలు, పాపన్నపేట, రిపోర్టర్