ఎస్‌బిఐ ఖాతదారులకు శుభవార్త..

Good News For SBI Account Holders
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్త. ఫిక్స్ డ్ డిపాజిట్లపై బ్యాంకు వడ్డీ రేట్లను పెంచింది. డిపాజిట్లపై 5 నుంచి 10 బేసిన్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త వడ్డీ రేట్లు జులై 30వ తేదీ నుంచి అమలవుతాయి. వివిధ కాలపరిమితులతో సాధారణ, వయో వృద్ధులు చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు ఇచ్చే వడ్డీ రేట్లలో చేసిన మార్పులను ఎస్‌బిఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఏడాది నుంచి పదేళ్ల కాలపరిమితికి రూ. కోటి కంటే తక్కువ చేసిన డిపాజిట్లపై వడ్డీని 5 నుంచి 10 బేసిన్ పాయింట్ల మధ్య పెంచింది. అంటే 0.05 శాతం నుంచి 0.1 శాతం పెరిగింది. అలాగే సంవత్సరం నుంచి 2సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితికి చేసే డిపాజిట్లపై గతంలో వడ్డీ రేటు 6.65 శాతం ఉండగా, ప్రస్తుతం 6.7 శాతానికి పెరిగింది. 2సంవత్సరాల నుంచి 3సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితికి 6.65శాతం నుంచి 6.75శాతానికి పెరిగింది. 5సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు డిపాజిట్లపై 6.75శాతం నుంచి 6.85శాతానికి పెరిగింది. ఎస్‌బిఐ ఉద్యోగులకు, ఎస్‌బిఐ పెన్షనర్లకు ఎస్‌బిఐ ప్రతిపాదించిన వడ్డీ రేటు కంటే ఒక శాతం ఎక్కువగా ఉంటుంది.

Comments

comments