ఎస్‌ఐ సస్పెన్షన్

SI suspension for taking rice in ration rice dealings

మన తెలంగాణ/వనపర్తి : వనపర్తి జిల్లాలో కొనసాగుతున్న రేషన్ బియ్యం దందా వ్యవహారంలో మాముళ్లు తీసుకొని అసలైన నిందితులను వదిలేసి దందాకు సంబంధం లేని మరొకరిపై కేసు నమోదు చేసిన సంఘటనలో పోలీస్ శాఖా విచారణ చేపట్టింది. విచారణ అనంతరం వనపర్తి రూరల్ ఎస్‌ఐ.మచ్చేందర్‌రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిసింది. గత నెల రోజు ల క్రితం వనపర్తి మండలం చిట్యాల గ్రామంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఒక వాహనం పోలీసులకు పట్టుబడింది. సంఘటన స్థలానికి రూరల్ ఎస్‌ఐ మచ్చేందర్‌రెడ్డి వెళ్లారు. అక్కడ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నవారిని వదిలేసి వేరొకరిపై కేసు నమోదు చేయడంపై బాధితులు జిల్లా ఎస్‌పికి పిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం ఎస్‌ఐ మచ్చేందర్‌రెడ్డిని బుధవారం సస్పెండ్ చేసినట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది.