ఎస్‌ఆర్‌ఎస్‌పి నుంచి నీటి విడుదల

Water Release from SRSP

నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా రెండు వేల క్యూసెక్కుల నీటిని బుధవారం విడుదల చేశారు. సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్‌రెడ్డి గోదావరి నీటికి పూజలు చేసిన అనంతరం నీటిని విడుదల చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు ఉండగా, ప్రస్తుతం 1084.50 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతం నుంచి 1,47,650 క్యూసెక్కుల వరదనీరు వస్తుందని, ప్రస్తుతం 65,294 టిఎంసిల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. నీటి విడుదల కార్యక్రమంలో ఇఇ రామారావు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Water Release from SRSP

Comments

comments