ఎస్సీ, ఎస్టీలపై దాడుల నిరోధమే లక్షం

The target is to prevent attacks on SCs and STs

ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ 

మనతెలంగాణ/నాగర్‌కర్నూల్: ఎస్సీ, ఎస్టీలపై జరగుతున్న దాడులు, అత్యా చారాలను నిరోంచడమే లక్షంగా ఎస్సీ కమిషన్ పని చేస్తుందని ఎస్సీ కమిషన్ ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్‌లోని ఎస్పీ కార్యాలయ సమావేశ భవ నంలో ఎస్సీ, ఎస్టీ చట్టాలపై రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లా డుతూ ఎస్సీ కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలు ఉంటాయని, అధికార యంత్రాం గం దాడులను అరికట్టడంలో విఫలమైతే కమిషన్ అలాంటి కేసులను సుమోటోగా స్వీక రించి చర్యలు తీసుకుంటుదన్నారు. 2009 నుంచి 2018 వరకు ఎస్సీ కమిషన్ లేదని, ఈ 9 ఏళ్ల వ్యవధిలో నియమితులైన పోలీసు, రెవె న్యూ అధికారులు, ఇతర శాఖల అధికారులకు ఎస్సీ, ఎస్టీ చట్టాలు, కమిషన్ గురించి తెలువక పోవడంతో అక్కడక్కడ ఎస్సీ, ఎస్టీలపై దౌర్జ న్యాలు, దాడులు పెరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. రెవెన్యూ, పోలీసు అధికా రులకు ఎస్సీ కమిషన్ బాధ్యతలు, నిర్వహణ తీరుపై అవగాహన కల్పించడానికి 13 జిల్లా లలో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని, అందులో బాగంగానే నాగర్‌క ర్నూల్‌లో ఈ సదస్సును నిర్వహించడం జరి గిందన్నారు. ఎస్సీ, ఎస్టీలు తమకు రక్షణ కల్పించే చట్టాలపై అవగాహన కల్గి ఉండాలని కోరారు. దాడులు జరిగినపుడు వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీలపై దాడులు, అత్యా చారాలుతలేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. బాధితు లకు కమిషన్ అండగా ఉంటుందని వీరికి భరోసా కల్పిస్తామన్నారు. ప్రతి సోమవారం గ్రామాలలో సివిల్ రైట్స్‌డేను నిర్వహించాలని అధికారులకు సూచించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణాకు తీవ్ర నష్టం జరిగిందని ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ఈ సమావేశంలో ఎస్‌పి సన్‌ప్రీత్ సింగ్, కమిషన్ సభ్యులు రాంబాల్ నాయక్, శ్రీనువాసులు, విద్యాసాగర్, చిలక మర్రి నర్సింహులు తదితరులున్నారు.

Comments

comments