ఎసిబికి చిక్కిన సంగారెడ్డి ఆస్పత్రి అధికారులు…

Sangareddy Medical officer arrested for taking bribe

సంగారెడ్డి : జిల్లా దవాఖానలోని అధికారులు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కారు. డాక్టర్ హైమావతి సర్వీస్ పొడిగించడానికి రూ. 80 వేలు డిమాండ్ చేశారు. దీంతో ఆమె ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేసింది. మంగళవారం సూపరింటెండెంట్ ఆఫీసులో మురారి, సీనియర్ అసిస్టెంట్ నరేందర్‌గౌడ్ ఇద్దరు కలిసి హైమావతి దగ్గర లంచం తీసుకుంటున్న సందర్భంలో ఎసిబి అధికారులు పట్టుకున్నారు. నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేసి, వారి నివాసాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.

Comments

comments