ఎసిబికి చిక్కిన రవాణా శాఖ కానిస్టేబుల్

అనంతపురం : రవాణా శాఖ కానిస్టేబుల్ రవీంద్రనాథ్‌రెడ్డి ఎసిబికి చిక్కారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలు రావడంతో ఆయన నివాసంలో ఎసిబి అధికారులు మంగళవారం దాడులు చేశారు. 1990లో రవాణా శాఖలో కానిస్టేబుల్‌గా చేరిన రవీంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం గుంతకల్లు రవాణా శాఖ కార్యాలయంలో పని చేస్తున్నాడు. ఆయన ఇంట్లో నిర్వహించిన సోదాల్లో కిలో బ ంగారు నగలు, కిలోన్నర వెండి, 14 నివాస స్థలాల డాక్యుమెంట్లను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రవీంద్రనాథ్‌రెడ్డికి అనంతపురంలోని […]

అనంతపురం : రవాణా శాఖ కానిస్టేబుల్ రవీంద్రనాథ్‌రెడ్డి ఎసిబికి చిక్కారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలు రావడంతో ఆయన నివాసంలో ఎసిబి అధికారులు మంగళవారం దాడులు చేశారు. 1990లో రవాణా శాఖలో కానిస్టేబుల్‌గా చేరిన రవీంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం గుంతకల్లు రవాణా శాఖ కార్యాలయంలో పని చేస్తున్నాడు. ఆయన ఇంట్లో నిర్వహించిన సోదాల్లో కిలో బ ంగారు నగలు, కిలోన్నర వెండి, 14 నివాస స్థలాల డాక్యుమెంట్లను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రవీంద్రనాథ్‌రెడ్డికి అనంతపురంలోని జీసెస్‌నగర్‌లో రెండు అంతస్తుల భవనం, తాడిపత్రిలో మూడు భవనాలు, ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు ఎసిబి అధికారులు గుర్తించారు. రవీంద్రనాథ్‌రెడ్డికి సంబంధించిన బ్యాంకు ఖాతాలను, లాకర్లను తనిఖీ చేయాల్సి ఉందని ఎసిబి డిఎస్‌పి జయరాజ్ తెలిపారు. రవీంద్రనాథ్‌రెడ్డి నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులు విలువ రూ.15 కోట్లు ఉంటుందని ఆయన వెల్లడించారు.

ACB Trapped the Transport Department Constable

Comments

comments

Related Stories: