ఎసిబికి చిక్కిన చీఫ్ ఇంజినీర్

ACB Caught the Chief Engineer

హైదరాబాద్ : నీటిపారుదల శాఖ కృష్ణా బేసిన్ చీఫ్ ఇంజినీర్ సురేశ్ ఎసిబికి చిక్కారు. హైదరాబాద్ సోమాజీగూడలో ఆయన ఇంటితో పాటు బంధువుల ఇళ్లల్లో ఎసిబి అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. హైదరాబాద్‌లోని నాలుగు చోట్ల, కరీంనగర్‌లోని సురేశ్ స్వగృహంలో సోదాలు చేశారు. కరీంనగర్‌లో రెండు ప్లాట్లు, పది ఇళ్ల స్థలాలు, రెండు ఇళ్లు, రూ.17లక్షల ఎఫ్‌డిలు, మూడు బ్యాంకు లాకర్లు ఉన్నట్టు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు సురేశ్‌పై ఆరోపణలు రావడంతో ఎసిబి అధికారులు ఈ తనిఖీలు చేశారు.

ACB Caught the Chief Engineer