ఎసిబికి చిక్కిన ఇఓపిఆర్‌డి

EOPRD-image

మన తెలంగాణ / చౌటుప్పల్ : మండల పరిషత్ కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి రూ. 70 వేల లంచం తీసుకుంటుండగా చౌటుప్పల్ మండల ఇఓపిఆర్‌డి జి.నర్సిరెడ్డిని బుధవారం ఎసిబి అధికారులు ప్ర త్యక్షంగా పట్టుకున్నారు. ఎసిబి డిఎస్‌పి క్రి ష్ణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం చౌటుప్పల్ మండల కేంద్రానికి చెందిన దాచేపల్లి మాధవ్ కు మారుడు చంద్రబాబు ఇంటి అనుమతుల నిమిత్తం చౌటుప్పల్ గ్రామ పంచాయతీలో ధరఖాస్తు చే సుకున్నాడు. ఇటీవలే సర్పంచుల పదవీకాలం ము గియడంతో చౌటుప్పల్ గ్రామ పంచాయతీకి ఇంచార్జి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఇఓఆర్‌డి జి.నర్సిరెడ్డి ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. అన్నీ తానై అవతారమెత్తాడు. ఇంటి అనుమతుల కోసం వచ్చిన వారి నుంచి ఇష్టారాజ్యంగా లంచాలు వసూలు చేయడం ప్రారంభించాడు. ఒకవేళ ఆశించినంత లంచం అందకపోతే ఆ పనిని పక్కన పెట్టేస్తాడు. అడిగినంత రొక్కం ముట్ట చెబితే మాత్రం పనులు చకచకా చక్కబెట్టేస్తాడు. ఇంటి అనుమతి కోసం ధరఖాస్తు చేసుకున్న చంద్రబాబుకూ ఇదే పరిస్థితి ఎదురైంది. లంచం ఇస్తేనే తప్ప అనుమతి లభించే మార్గం కనిపించక పోవడంతో కార్యాలయం తిరిగి విసిగి వేసారిన ఆయన గత నెల 24న ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. అందుకు సంబంధించిన ఆధారాలను వీడియోల రూపంలో అధికారుల ముందుంచాడు. వారి సూచన మేరకు పథకం ప్రకారం ఇఓఆర్‌డి కి రూ.70 వేలు లంచంగా ఇచ్చుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదే క్రమంలో చంద్రబాబు ఇఓఆర్‌డి నర్సిరెడ్డికి లంచం డబ్బులు అందజేస్తుండగా అప్పటికే అక్కడ మాటు వేసిన ఎసిబి అధికారులు రంగ ప్రవేశం చేసి ప్రత్యక్షంగా పట్టుకున్నారు. అతడి నుంచి రూ. 70 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఈ సంఘటనలో ఎసిబి డిఎస్పీ క్రిష్ణగౌడ్ తో పాటు సిఐ రవి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.