ఎర్రకోట సమీపంలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్..!

Two suspected ISIS terrorists arrested near Red Fort

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఈ ఇద్దరు తీవ్రవాదులు జమ్మూకాశ్మీర్ నుంచి వచ్చినట్లు తేలింది. వారిని పర్వేజ్, జమ్‌షేద్‌గా గుర్తించారు. వీరి స్వస్థలం జమ్మూకాశ్మీర్  సోపియాన్ జిల్లా. గురువారం రాత్రి ఎర్రకోట సమీపంలోని బస్టాపులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వారి వద్ద నుంచి అధునాతన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Comments

comments