ఎర్రకోటలో అనుమానాస్పద వస్తువు.. పరుగులు పెట్టిన పోలీసులు

Red-Fort

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో సోమవారం అనుమానాస్పదంగా కనిపించిన ఓ వస్తువు పోలీసులను పరుగులు పెట్టించింది. ఎర్రకోట ప్రాంగణంలో విధులు నిర్వర్తిస్తోన్న సెక్యూరిటీ గార్డుకు ఓ వస్తువు అనుమానాస్పదంగా కనిపించడంతో కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందిచాడు. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. అలాగే ముందు జాగ్రత్త చర్యగా అగ్నిమాపక సిబ్బందిని కూడా రప్పించింది.

అనంతరం రంగంలోకి దిగిన యాంటీ బాంబు స్కాడ్ ఆ వస్తువును ఒక సైన్యానికి సంబంధించిన నిర్వీర్యమైన పేలుడు పదార్థంగా గుర్తించారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ వస్తువు అక్కడికి ఎలా వచ్చిందో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే గతవారం రెడ్‌పోర్టు ప్రాంగణంలోని ఓ పాత బావిని శుభ్రం చేసే సమయంలో పలు పాత గ్రనేడ్లు, తూటాలు దొరికినట్లు అక్కడి అధికారి ఒకరు తెలిపారు.

Comments

comments