ఎయిర్ టెల్ సరికొత్త ఆఫర్…

Airtel Rs 399 Postpaid Plan
న్యూఢిల్లీ:   టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ ఎప్పడికప్పుడు సరికొత్త ప్లాన్లను ఆవిష్కరిస్తూ ఉంది.  రూ. 399 పోస్టు పోయిడ్ ప్లాన్ లో ప్రస్తుతం ఇస్తున్న డేటాకు అదనంగా ఏడాదికి 20 జిబి డేటాను ప్రకటించింది. ఎయిర్‌టెల్ రూ.399 పోస్టు పెయిడ్ ప్లాన్‌లో నెలకు 20 జిబి 3జి/4జి డేటా, 200 జిబి వరకు రోలోవర్ సౌకర్యం అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు దీనికి అదనంగా ఏడాదికి మరో 20 జిబి ఇస్తోంది. జియో, వొడాఫోన్ రూ.399 పోస్టు పెయిడ్ ప్లాన్‌కు పోటీగా దీనిని ప్రకటించింది. వొడాఫోన్ ఈ ప్లాన్‌లో నెలకు 40 జిబి డేటా అందిస్తోంది. వొడాఫోన్, ఎయిర్‌టెల్ రెండూ అపరిమిత లోకల్, ఎస్టిడి, రోమింగ్ కాల్స్ అందిస్తున్నాయి. వొడాఫోన్ అదనంగా ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తోంది.  ఎయిర్‌టెల్ మాత్రం కేవలం వింక్ మ్యూజిక్ సర్వీసును మాత్రమే ఆఫర్ చేస్తోంది.

Comments

comments