ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి

4 Maoists killed in encounter

ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లా గుమిత్ బీడ్ అటవీ ప్రాంతంలో సిఆర్ పిఎఫ్ పోలీసులకు ,మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. సిఆర్ పిఎఫ్ పోలీసులు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. మృతుల్లో మహిళా మావోయిస్టు, ఇద్దరు కమాండర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Comments

comments