ఎడపల్లిలో యువకుడి హత్య

జయశంకర్ భూపాలపల్లి : మహాదేవ్‌పూర్ మండలం ఎడపల్లిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఎపిలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరంకు చెందిన సంగిశెట్టి కిశోర్‌ను విజయ్ అనే వ్యక్తి గొడ్డలితో నరికి చంపేశారు. విజయ్ సోదరి ప్రేమ వ్యవహారంలో కిషోర్ సహకరించాడన్న కారణంతో ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కిశోర్ ఇసుక క్యారీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. పోస్టుమార్టం కోసం కిశోర్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు […]

జయశంకర్ భూపాలపల్లి : మహాదేవ్‌పూర్ మండలం ఎడపల్లిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఎపిలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరంకు చెందిన సంగిశెట్టి కిశోర్‌ను విజయ్ అనే వ్యక్తి గొడ్డలితో నరికి చంపేశారు. విజయ్ సోదరి ప్రేమ వ్యవహారంలో కిషోర్ సహకరించాడన్న కారణంతో ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కిశోర్ ఇసుక క్యారీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. పోస్టుమార్టం కోసం కిశోర్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Young Man Murder in Edappally