ఎక్సైజ్ దాడులో ఒకరిపై కేసు నమోదు

One arrested in excise attacks

కల్వకుర్తి: కల్వకుర్తి డివిజన్ పరిధిలోని ఊర్కొండ మండలంలో కల్వకుర్తి ఎక్జైజ్ ఎస్‌ఐ స్టిఫెన్‌సన్ ఆద్వర్యంలో శనివారం రెడ్యా తాండాలో దాడులు నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ దాడుల్లో 50కి.లో నల్ల బెల్లం, 5కిలోల పటికి సారా ప్యాకెట్లు లభించాయని వీటితోపాటు జర్పులావత్ జల్యానాయక్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. ఇక నుండి ఎక్కడ నాటు సారా తయారి విక్రయాలు చేసిన చర్యలు కఠినంగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, రాఘవేందర్, బిక్షపతి, గణేష్, తదితరులు ఉన్నారు.

Comments

comments