ఎక్కడ చెత్త అక్కడే.. ప్రబలుతున్న జ్వరాలు

మన తెలంగాణ/రాయపర్తి : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత 12 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికి ప్రభుత్వం దిగిరాకపోవడంతో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో గ్రామాలలో పారిశుద్ధ్యం లోపించి ఎక్కడ చెత్త అక్కడే ఉండటంతో వచ్చిపోయే వానలతో మురిగిపోయి దుర్ఘంధం లేచి దోమలు, ఈగలు గ్రామాలలో స్వైర విహారం చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో వీధులను, మురుగు కాలువలను శుభ్రం చేసే కార్మికులు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని, ఈ మధ్యలో […]

మన తెలంగాణ/రాయపర్తి : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత 12 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికి ప్రభుత్వం దిగిరాకపోవడంతో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో గ్రామాలలో పారిశుద్ధ్యం లోపించి ఎక్కడ చెత్త అక్కడే ఉండటంతో వచ్చిపోయే వానలతో మురిగిపోయి దుర్ఘంధం లేచి దోమలు, ఈగలు గ్రామాలలో స్వైర విహారం చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో వీధులను, మురుగు కాలువలను శుభ్రం చేసే కార్మికులు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని, ఈ మధ్యలో కురిసిన వర్షాల వల్ల చెత్తలో నీరు నిలిచి దోమలు, ఈగలు చేరి చెడు వాసనతో గ్రామాలు పారిశుద్ధ్యలోపంతో కూనరిల్లుతున్నాయని వాపోతున్నారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు గత 20 సంవత్సరాలుగా చాలీ చాలనీ వేతనాలతో దుర్భర జీవితాలను గడుపుతున్నా పారిశుద్ధ్య కార్మికులను పట్టించుకోకపోవడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చిన్నా చితక ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచి గ్రామ పంచాయతి ఉద్యోగుల వరకు వచ్చే సరికి చేతులు ఎత్తేస్తున్నదన్నారు. పూజ్య బాపూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం రావాలంటే గ్రామాలలో పారిశుద్ధ్య రహిత గ్రామాలుగా ఉన్నప్పుడే సాద్యపడుతుందని, ఇప్పటికైన వెంటనే ప్రభుత్వం దిగివచ్చి వారి సమస్యలను పరిష్కరించి గ్రామాలను పారిశుద్యరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు.

Comments

comments

Related Stories: