ఎంత వేగంగా ఆలోచించగలరు

Absolutely-Mental-1రోనాల్డ్ మోర్గాన్ రాసిన పజిల్ బుక్ ఇది. పెద్దవాళ్లకి, టీనేజ్ పిల్లలకు, టీనేజ్ లోపలి వయసు పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. ఆబ్సల్యూట్‌లీ మెంటల్ 1, మైండ్ పరిపక్వతకు పనికివస్తుంది. కాలిక్యులేషన్‌లు చాలా త్వరగా చేయడానికే కాదు, సింపుల్ లాజిక్‌కి, తెలివికి కూడా పనికొస్తుంది. పజిల్స్ ఇలా ఉంటాయి. మీరు భూమికి పది వేల కిలోమీటర్ల పైన, 600 కిలోమీటర్ల వేగంతో ఎగిరే ప్రైవేట్ జెట్‌లో ఉన్నారు. పైలట్‌కి హార్ట్ ఎటాక్ వచ్చింది. మిమ్మల్ని ఫ్తైట్ నడపమని ఆర్డర్ వచ్చింది. విండ్ స్క్రీన్ నుంచి ఒక మీరు ఒక కొండని చూశారు. ఆ కొండను చేరడానికి కేవలం ఒక కిలోమీటర్ దూరమే ఉంది. పాసింజర్ల జీవితాలు మీ చేతిలో ఉన్నాయి. జెట్ కొండను గుద్దుకోకుండా కాపాడటానికి మీ దగ్గర ఎంత సమయం ఉంది?
ఇలాటి పజిల్స్ చేయడానికి వేగంగా మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ చేయగలాలి. ఆ పరిస్థితికి తగ్గట్టు లాజికల్‌గా ఆలోచించే శక్తిని పెంచేలా ఉంటాయి. ఇంకెదుకు ఆలస్యం. ఈ పుస్తకాన్ని తెచ్చి మెదడుకు మేత వెయ్యండి.