ఎండుపండు పోషకాలు మెండు

ఎండుపండ్లు పేరు వింటే కొత్తగా ఉంటుంది కానీ అందరికీ తెలిసినవే. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం గొప్పవి. ఇవి చిన్న చిన్న ప్యాకెట్స్‌లో కూడా అందుబాటులో దొరుకుతున్నాయి. డ్రైనట్స్ బెస్ట్ న్యూట్రీషియన్ స్నాక్స్ అని అనని వారు ఉండరు. బాదం, పిస్తా, వాల్‌నట్స్, మకడామియా, జీడిపప్పు మొదలైనవి ఈ కోవలోకే వస్తాయి. వాటి గురించి ఒకసారి నెమరువేద్దాం. వాల్‌నట్స్ వీటిని బ్రెయిన్ ఫుడ్ అంటారు. ఇవి చూడటానికి అచ్చు మెదడు ఆకారాన్ని కలిగి ఉంటాయి. వాట్‌నట్స్‌లో […]

ఎండుపండ్లు పేరు వింటే కొత్తగా ఉంటుంది కానీ అందరికీ తెలిసినవే. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం గొప్పవి. ఇవి చిన్న చిన్న ప్యాకెట్స్‌లో కూడా అందుబాటులో దొరుకుతున్నాయి. డ్రైనట్స్ బెస్ట్ న్యూట్రీషియన్ స్నాక్స్ అని అనని వారు ఉండరు. బాదం, పిస్తా, వాల్‌నట్స్, మకడామియా, జీడిపప్పు మొదలైనవి ఈ కోవలోకే వస్తాయి. వాటి గురించి ఒకసారి నెమరువేద్దాం.

వాల్‌నట్స్ వీటిని బ్రెయిన్ ఫుడ్ అంటారు. ఇవి చూడటానికి అచ్చు మెదడు ఆకారాన్ని కలిగి ఉంటాయి. వాట్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. పోస్ట్ మెనోపాజ్ లక్షణాలను తగ్గిస్తుంది. ప్రాణాంతక వ్యాధులు రాకుండా కాపాడుతుంది. బరువు తగ్గడానికి, రక్తపోటు తగ్గడానికి సహాయపడుతుంది.

పిస్తా వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ పిస్తా పండు పైన మందపాటి డొల్ల(కవచం)ఉంటుంది. దీనిలోని గమ్మటోకోఫెరల్ లంగ్ క్యాన్సర్‌ను తగ్గిస్తుంది. నరాలకు తగినంత బలాన్ని ఇస్తుంది. రక్తంలోని ఆక్సిజన్ పరిమాణం పెంచడానికి, హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. మెదడు చురుగ్గా ఉండేందుకు కృషి చేస్తుంది. వివిధ క్యాన్సర్లు నిరోధించడంలో ఇది చేసే పని అమోఘం.

అంజీర వీటిలో కాల్షియం, పొటాషియం, పీచు కూడా దండిగా ఉంటాయి. కండరాల పనితీరు మెరుగుపడుతుంది. గుండెకు మంచిది.

బాదం ఫైబర్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. అధిక మొత్తంలో మినరల్స్‌ను కలిగి ఉండే వాటిలో బాదంపప్పు ప్రత్యేకం. నీటిలో నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల సులభంగా జీర్ణం అవటమే కాకుండా, చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

జీడిపప్పు వీటిని ‘కాజు’ అని పిలుస్తుంటారు. జింక్, ఐరన్ అధికంగా ఉంటుంది. దాంతో హీమోగ్లోబిన్ లెవల్స్ తగ్గుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. కోలన్ క్యాన్సర్ పెరుగుదల నివారణలో జీడిపప్పు ముఖ్యపాత్ర పోషిస్తుంది. వీటిలోని కాపర్ వల్ల కురులు నల్లగా ఉంటాయి. అనీమియా, పెల్లాగ్రా వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

బ్రాజల్ నట్స్ ఇవి క్యాన్సర్‌ను నివారించడలో చాలా గొప్పగా సహాయపడుతాయి. బ్రాజిల్ నట్స్‌లో సెలీనియం అధికంగా ఉంటుంది. ఇది ప్రొస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి.

Comments

comments

Related Stories: