ఎంజె-3, ఎంజె-4 కెనాల్స్ పనులను వేగవంతం చేయండి

మన తెలంగాణ/వనపర్తి : ఎంజె-3, ఎంజె-4 కెనాల్స్  పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లాలో ప్రతి చెరువుకు సాగునీరు అందించేందుకు గాను ఎంజికెఎల్‌ఐలో భాగంగా చేపట్టిన ఘణపురం బ్రాంచ్ కాల్వ, బుద్దారం కుడి, ఎడమ కాల్వలు మరియు డి-8లోని ఎంజె-3, ఎంజె-4 కాల్వల మిగిలిన పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులతో సమీక్షా నిర్వహించారు. పాలమూర్ చీఫ్‌ఇన్ ఇంజనీర్ ఖగేందర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ […]

మన తెలంగాణ/వనపర్తి : ఎంజె-3, ఎంజె-4 కెనాల్స్  పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లాలో ప్రతి చెరువుకు సాగునీరు అందించేందుకు గాను ఎంజికెఎల్‌ఐలో భాగంగా చేపట్టిన ఘణపురం బ్రాంచ్ కాల్వ, బుద్దారం కుడి, ఎడమ కాల్వలు మరియు డి-8లోని ఎంజె-3, ఎంజె-4 కాల్వల మిగిలిన పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులతో సమీక్షా నిర్వహించారు. పాలమూర్ చీఫ్‌ఇన్ ఇంజనీర్ ఖగేందర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ భద్రయ్య, ఈఈ రమే ష్, రాంచందర్, డిఈ సంబంధిత కాంట్రాక్టర్ లతో సమీక్ష నిర్వహించారు. బుద్దారం కాల్వ, బుద్దారం ఎడమ కాల్వకు సంబంధించిన అసంపూర్తిగా మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. బుద్దారం రిజర్వాయర్ బుద్దారం రిజర్వాయర్‌తో పాటు గండి ఆంజనేయస్వామి, వనపర్తి రోడ్డుకు పై భాగంలో బుద్దారం గండిలో మరొ క రిజర్వాయర్‌ను ప్రతిపాదించి పొలికేపహాడ్, బుద్దారం, బుద్దారంం తాండాలకు సంబంధించి 6 వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రతిపాదనలు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. గట్ల ఖానాపూర్ దగ్గర కొత్తగా రిజర్వాయర్ కు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయడం జరిగిందని, దాని ద్వారా బుద్దారం, ఘణపురం కాల్వ యొక్క చివరి ఆయకట్టుకు నీరు అందు తుందన్నారు. ఘణపూర్ ప్రధాన కాల్వ పనులను పూర్తి చేయాలని, మిగిలిన స్ట్రక్చర్స్ పనులను యుద్ద ప్రాతి పాదికన పూర్తి చేయాలని , ఈరబీ సీజన్‌లో ఘణపురం కాల్వ నీళ్లు, అడ్డాకుల వరకు అందేటట్లు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంజె-3డిస్ట్రిబ్యూటర్ కింద అదనపు ఆయకట్టు మంజూరు చేసి దీని ద్వారా వనపర్తి మెట్‌పల్లి, వనపర్తి మండలంలోని శ్రీనివాసపురం,పెద్దగూడెం గ్రామానికి చెందిన ఖాన్ చెర్వుకు నీళ్లు అందించే ప్రతిపాదనను చర్చించి ప్రభుత్వ అనుమతికి పంపడం జరిగిందన్నారు. పాలమూర్ -రంగారెడ్డి పాలమూర్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద వనపర్తి జిల్లాలోచేపడుతున్న గొల్లపల్లి, ఘణపురం, గట్ల ఖానాపూర్, వెల్టూర్, బుద్దారం, మొగుళ్ల చెర్వు, గోపాల్ పేట చెర్వు ,తల్పునూర్ చెర్వు మరియు లక్ష్మీదేవమ్మ రిజర్వాయర్‌ల ప్రతిపాదనలపై చర్చించి వాటిని అతి త్వరగా రాష్ట్రప్రభుత్వాని కి పంపే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధి కారులు , ఏజెన్సీ బృందాలు పాల్గొన్నాయి.

Comments

comments

Related Stories: