ఎంఎల్‌ఎపై ఆరోపణలు చేయడం శోచనీయం

మన తెలంగాణ/కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై మున్సిపల్ చైర్‌పర్సన్‌తో పాటు కొందరు కౌన్సిలర్లు రాజకీయం చేస్తున్నారని, అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్‌పర్సన్ టీఆర్‌ఎస్ పార్టీతో సంబంధం లేని కొందరు కౌన్సిలర్లను వెంట వేసుకొని సిర్పూర్ ఎంఎల్‌ఎలపై లేని పోని ఆరోపణలు చేయడం శోచనీయమని, మున్సిపల్ కౌన్సిలర్లు రాచకొండ గిరీష్ కుమార్, విజయ్ యాదవ్, నియాజుద్దీన్ బాబా, అబ్దుల్ రహీం, కనుకుంట్ల శివప్రసాద్, స్రవంత బాయి, కో ఆప్షన్ సభ్యులు […]

మన తెలంగాణ/కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై మున్సిపల్ చైర్‌పర్సన్‌తో పాటు కొందరు కౌన్సిలర్లు రాజకీయం చేస్తున్నారని, అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్‌పర్సన్ టీఆర్‌ఎస్ పార్టీతో సంబంధం లేని కొందరు కౌన్సిలర్లను వెంట వేసుకొని సిర్పూర్ ఎంఎల్‌ఎలపై లేని పోని ఆరోపణలు చేయడం శోచనీయమని, మున్సిపల్ కౌన్సిలర్లు రాచకొండ గిరీష్ కుమార్, విజయ్ యాదవ్, నియాజుద్దీన్ బాబా, అబ్దుల్ రహీం, కనుకుంట్ల శివప్రసాద్, స్రవంత బాయి, కో ఆప్షన్ సభ్యులు ఎండీ. వలీ, టీఆర్‌ఎస్ నాయకులు వనమాల రాము, వైద్య బాలకృష్ణ తదితరులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గురువారం మున్సిపల్ చైర్‌పర్సన్ సీపి విద్యావతితో పాటు మరి కొంత మంది కౌన్సిలర్లు హైద్రాబాద్‌కు వెళ్లి సీడిఎంఏ శ్రీదేవికి మున్సిపల్ కమీషనర్ బట్టు తిరుపతిను తక్షణమే ఇక్కడి నుండి బదిలీ చేయాలని డిమాండ్ చేశారని, అయితే సిడిఎంఏ కార్యాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ కొంత మంది కౌన్సిలర్లు సిర్పూర్ ఎంఎల్‌ఎ ప్రోత్బలంతోనే కమీషనర్ అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపించడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీని ఆశించిన స్థాయిలో అభివృద్ధి పర్చడంతో ప్రధాన భూమిక పోషించిన ఘనత సిర్పూర్ ఎమ్మెల్యేకే దక్కిందని, ఆయన ప్రభుత్వం నుండి భారీగా అభివృద్ధి నిధులను తీసుకువచ్చారని గుర్తు చేశారు. మున్సిపల్ కమీషనర్ సరెండర్ అంశంలో స్థానిక ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేకపోయిన చైర్‌పర్సన్‌తో పాటు కొందరు కౌన్సిలర్లు అసత్యపు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీతో సంబంధం లేని కొంత మంది కౌన్సిలర్లను వెంట వేసుకొని చైర్‌పర్సన్ స్థానిక ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలు సత్యదూరమని వారు స్పష్టం చేశారు. ప్రజా సేవకు అంకితమైన ఎంఎల్‌ఎపై ఆరోపణలు చేసిన వారిని రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. బల్దియాలో ఎవరూ ఏమి చేస్తున్నారో పట్టణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఈ విషయాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగాలని వారు సలహా ఇచ్చారు.

Related Stories: