ఎంఎల్ఎ కొడుకు అనుమానాస్పద మృతి…

పాట్నా: జెడియు ఎంఎల్ఎ బిమా భారతి కుమారుడు దీపక్ కుమార్ (21) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన పాట్నాలోని రాజేంద్రనగర్ రైల్వేస్టేషన్ టర్మినల్‌కు సమీపంలో చోటుచేసుకుంది. దీపక్‌కుమార్ గురువారం రాత్రి బజార్ సమితి ప్రాంతంలోని తన మిత్రుడి ఇంట్లో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దీపక్ కుమార్ ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిర్వహించిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని పాట్నా ఎస్ఎస్ పి మను మహరాజ్ స్పష్టం […]

పాట్నా: జెడియు ఎంఎల్ఎ బిమా భారతి కుమారుడు దీపక్ కుమార్ (21) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన పాట్నాలోని రాజేంద్రనగర్ రైల్వేస్టేషన్ టర్మినల్‌కు సమీపంలో చోటుచేసుకుంది. దీపక్‌కుమార్ గురువారం రాత్రి బజార్ సమితి ప్రాంతంలోని తన మిత్రుడి ఇంట్లో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దీపక్ కుమార్ ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిర్వహించిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని పాట్నా ఎస్ఎస్ పి మను మహరాజ్ స్పష్టం చేశారు. బిమా భారతి పూర్ణియా జిల్లాలోని రూపౌలీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా… ఆమె భర్త అవధేశ్ మండల్ సీమాంచల్ సరిహద్దుల్లో వెంబడి పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ కావడం గమనార్హం. అతనిపై పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. బీహార్ సిఎం నితీశ్ కుమార్ బిమా భారతి నివాసానికి చేరుకుని దీపక్‌కుమార్ మృతదేహానికి నివాళులర్పించి, సానుభూతిని తెలిపారు.

Related Stories: