ఊహించని జల ప్రళయం

Three days of rain, ponds have become aquatic

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో రూ.100 కోట్లకుపైగా నష్టం
కూలిన బ్రిడ్జిలు, దెబ్బతిన్న రోడ్లు
వేల సంఖ్యలో ధ్వంసమైన ఇండ్లు
లక్షలాది ఎకరాల్లో పంటనష్టం
పదుల సంఖ్యలో పశువులు మృత్యువాత 

మన తెలంగాణ / ఆదిలాబాద్: గడిచిన మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ చవిచూడని విధంగా ఊ హించని జలప్రళయం ఉమ్మడి జిల్లాను అతలాకుతలం చేసింది. మూడు రోజుల పాటు ఎడతేరిపి లేని వర్షం కురిసిన కారణంగా వాగులు, వంకలు జలాశయాలుగా మారాయి. జలాశయాలు పరవళ్లు తొక్కాయి. వందలాది కాలనీలు, గ్రామాలు నీట మునిగాయి. పెన్‌గంగ, ప్రాణహిత నదులతో పాటు వాగులకు ఉధృతంగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆ పరీవాహక ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రోజుల తరబడి కొన్ని గ్రామాలకు రాకపో కలు నిలిచిపోయాయి. అంతర్రాష్ట్రీయ రహదారులు సై తం దెబ్బతినడంతో ప్రత్యామ్నాయ మార్గల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కుండపోతగా వర్షం కారణంగా సుమారు 100 కోట్లకు పైగా న ష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబా ద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది.

ఆదిలాబాద్ జిల్లాలో సుమా రు లక్ష 20వేల ఎకరాలకు పైగా నష్టం వాటిల్లిగా 462 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 15 మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా నమోదైంది. 11 చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వరద బాధితుల కు వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. ఐదు రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో సహాయ శిబిరాలు కొనసాగుతుండడం వరద ఉధృతి ఎంత ఉంతో ఊహించుకోవచ్చంటున్నారు. సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులు పొంగిపొర్లాయి. పెన్ గంగ నది పరివాహక ప్రాంతమంతా నీట మునిగింది. జైనథ్ మండలంలోని తర్నం బ్రిడ్జి, సిరికొం డ మండలంలోని కొండాపూర్ బ్రిడ్జిలు కొట్టుకుపోవడం విశేషంగా చెప్పవచ్చు. నష్టం అంచనపై అధికార యం త్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. జిల్లాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకున్నయంటే పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోందంటున్నారు. జిల్లాకు చెందిన మంత్రి జోగు రామన్నతో పాటు కలెక్టర్ దివ్యదేవరాజన్, ఐటీడీ ఏ పీవో అధిత్యా క్షష్ణతో పాటు ఇతర అధికార యం త్రాంగం, ప్రజాప్రతినిధులు వరద నీటి ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు.

వరి, పత్తి, కం ది, సోయా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నిన్న, మొ న్నటి వరకు గులాబి పురుగు బెడదతో సతమతమైన రై తాంగానికి జలప్రళయం నిండ వారిని ముంచేసింది. ఎ టు చూసినా పచ్చని పొలాలు ఇసుక మేటలతో కోతకు గురైన భూములు దర్శనమిస్తున్నాయి. బజార్‌హత్నూర్, ఇచ్చోడ, సిరికొండ, ఆదిలాబాద్‌లో 20 కాలనీలు జలమాయం అవడంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టి) నియోజకవర్గం వర్ష భీభత్సానికి గు రైంది. కౌటల, బెజ్జురు, సిర్పూర్(టి), దహెగాం, చింతలమానేపల్లి వరద తాకిడిలో మునిగితేలాయి. ఇక్కడ సు మారు 30వేల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు), వాంకి డి మండలాలు సైతం వరద తాకిడికి గురయ్యాయి పలుచోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. బ్రిడ్జిలు నేలమట్టం అయ్యాయి. ప్రాణహిత నది పొంగిపొర్లడంతో కో టపల్లి, వేమనపల్లి, చేన్నూర్ మండలాల్లోన్ని పలు చోట్ల వేలాది ఎకరాలు నీట మునిగాయి. ఎర్రవాగు, నిల్వాయి వాగు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచాయి.

జన్నా రం మండలంలో నిర్మాణంలో డైవర్షన్ బ్రిడ్జి కొట్టుకుపోవడంతో ఆదిలాబాద్-మంచిర్యాల, నిర్మల్ రహదారిపై రా కపోకలకు అంతరాయం కలిగింది. తాత్కలిక మరమ్మత్తు లు చేపట్టినప్పటికి మళ్లీ ముంచెత్తిన వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో ప్రయాణీకులు అనేక అవస్థలు పడ్డారు. ప్రాణ నష్టం జరగనప్పటికి పశువు సంపద మాత్రం మృ త్యువు పాలైంది. నిర్మల్ జిల్లాలో వందకు పైగా ఇళ్లు పా క్షింకగా దెబ్బతినగా, ఆసిఫాబాద్ జిల్లాలో 500లకు పై గా ఇళ్లు, మంచిర్యాలలో మరో 300పైగా ఇళ్లు పాక్షికం గా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 10వేల ఎకరాలకు పైగా వరి పంట, పత్తి 1.5 లక్షలు, సోయా 25వేల, కంది 12వేల, జొన్న ఇతర పంటలు నష్టపోయినట్లు అధికారులు అంచన వేస్తున్నారు. దాదాపు వందల కు పైగా గ్రామాలు 24 గంటల పాటు వరద నీటిలో చి క్కుకున్నాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్ పాటిల్, ఆర్వీకర్ణన్, దివ్య దేవరాజన్‌లు అదికారులను అప్రమత్తం చేయడంతో పాటు వరద ప్రాంతాలను సందర్శించి తగిన సహాయక చర్యలు చేపట్టారు. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యే లు సైతం బాదితులకు అండగా నిలిచి వారిలో ధైర్యాన్ని నింపారు. నిర్మల్ జిల్లాలో కేవలం 700 ఎకరాల్లో మా త్రమే పంట నష్టం వాటిల్లింది.

ఉమ్మడి జిల్లాలోని ఇతర ప్రాంతాలతో పొలిస్తే నిర్మల్‌లో అతితక్కువ వర్ష పాతం నమోదైంది. స్వర్ణా, కడెం, గడ్డెన్న వాగు ప్రాజెక్టులు నిం డ కుండల్లా మారడంతో గేట్లు ఎత్తివేసి కిందకు నీటిని వ దిలారు. భైంసా డివిజన్‌లో చెరువులన్నీ జలకళను సంతరించుకోక నిర్మల్ డివిజన్‌లో ఇప్పటికి పలు మండలాల్లో చెరువుల్లోకి నీరు రాకపోవడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోని 10 కిలో మిటర్ల మేర రహదారులు భారీగా కోతకు గురికాగా చా లా చోట్ల వాహనదారులు నడవాడానికి సైతం వీలుగానీ విధంగా రహదారులు దెబ్బతిన్నాయి. ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో సుమారు 100 కిలోమీటర్ల పరిధిలో రహదారు లు గుంతలమయమయ్యాయి. కొన్ని చోట్ల బ్రిడ్జిలు నేలకోరిగాయి. అప్రోజ్‌రోడ్లు దెబ్బ తినడంతో తాత్కలిక మరమ్మత్తులను వెంటనే చేపట్టాల్సిన పరిస్థితి ఉందంటున్నా రు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ ఊహించని జలాప్రళయం భారీ నష్టానికి గురి చేసి ప్రజలను కకావికలం చేసింది.