ఊరూరా ఘనంగా పొలాల పండుగ

పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో శనివారం పొలాల అమావాస్య పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బసవన్నలను అలకరించి మున్నూర్‌కాపు సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చి సాయిబాబా ఆలయ సమీపంలో గల హనుమాన్ ఆలయం చుట్ట్టూ రైతులు ఎడ్లను ప్రదక్షిణలు చేయించి, ముథోల్ ఎమ్మెల్యే జి. విఠల్‌రెడ్డి హారతి చేపట్టారు. నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎడ్లను తేచ్చే రైతులకు అవాహనం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి. విఠల్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు […]

పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో శనివారం పొలాల అమావాస్య పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బసవన్నలను అలకరించి మున్నూర్‌కాపు సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చి సాయిబాబా ఆలయ సమీపంలో గల హనుమాన్ ఆలయం చుట్ట్టూ రైతులు ఎడ్లను ప్రదక్షిణలు చేయించి, ముథోల్ ఎమ్మెల్యే జి. విఠల్‌రెడ్డి హారతి చేపట్టారు. నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎడ్లను తేచ్చే రైతులకు అవాహనం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి. విఠల్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు మురళీగౌడ్, నేతాజీ సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ అర్బన్: రైతన్నల ప్రియ నేస్తాలు ఎద్దుల పండుగ పొలాల అమావాస్యను ఊరు వాడ సంబరంగా జరుపుకున్నారు. ఊరూరా ఎడ్ల పొలాల సందడి నెలకొంది. ఏడాది పొడవునా తమకు సేవలందించి చేదోడువాదోడుగా ఉంటే ఎద్దులను వ్యవసాయ కుటుంబాల వారు సాక్షాత్తు నంది స్వరూపులుగా భావిస్తారు. శ్రావణ మాసం వచ్చే చివరి అమావాస్య రోజున ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు తినిపంచడం ఆనవాయితి. ఎద్దులకు ప్రత్యేక పూజలు చేసి పోచమ్మ, హనుమాన్ ఆలయాల చుట్టు ప్రదిక్షణలు చేసి పిండి వంటలు తినిపించారు.
నేరడిగొండ: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని వచ్చే పొలాల అమావాస్య రోజున గ్రామీణ ప్రాంతాల్లో ఘనంగా జరిపే ఎడ్ల పండు గ శనివారం మండలంలోని వాంకిడి, వడూర్, పలు గ్రామాల్లో పొలాల పండుగను జరుపుకున్నారు. రైతులు ప్రాధాన్యతను సంచరించుకొన్న పండుగుల్లో పోలాల పండుగ ఒకటి. తొలి పంటలు చేతికందిన వేళ.. ఆరు మాసాలు వ్యవసాయ పొలంలో రైతులతో పాటు పని చేసి బసవన్నల కష్టాలు దాదాపు పొలాల పండుగనాటికి తీరిపోతాయి. రైతులు వేసిన తొలిపంటలు ఈ సమయంలోనే చేతికి రావడంతో వాటితో నైవేద్యాన్ని చేసి పశువులకు పెట్టడం అనవాయితిగా వస్తుంది. ఎడ్ల మరుసటి రోజు బొడగ జరుపు కుంటారు. పొలాల అమవాస్య పండుగ సందర్బంగా రైతులు తమ తమ బసవన్నలకు చేరువుల,వాగులలోకి తిసుకెళ్లి వాటికి స్నానాలు చేహించి, మెడలో గంట మాలలు, జోల్లు, మొరికలు, పగ్గాలు, మొగుదాళ్లు, చలితాడు లాంటివి వేసి రంగురంగుల వస్తువులతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామంలో హన్మాన్ మందిరాల వద్దకు తీసువెళ్లి వాటితో ప్రదక్షణలు చేయించి.తమ ఇంటి వద్దకు తీసుకొని వచ్చి నైవేద్యాన్ని బసవన్నలకు తీనిపించారు.ఆనంతరం రైతులు ఉపవాస దీక్షలు విరమించారు.

Comments

comments

Related Stories: