ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

జగిత్యాల: జగిత్యాల మండలంలోని మోరపెల్లి గ్రామానికి చెందిన పోతుగంటి సందీప్ (21) అనే యువకుడు శనివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు జగిత్యాల రూరల్ పోలీసులు తెలిపారు. సందీప్ కొంత కాలం గల్ఫ్ వెళ్లి వచ్చాడు. తిరిగి గల్ఫ్‌కు వెళ్లాల్సిన సందీప్ జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో గొడవ జరగడంతో తీవ్ర మనస్థాపానికి గురై సందీప్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు […]


జగిత్యాల: జగిత్యాల మండలంలోని మోరపెల్లి గ్రామానికి చెందిన పోతుగంటి సందీప్ (21) అనే యువకుడు శనివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు జగిత్యాల రూరల్ పోలీసులు తెలిపారు. సందీప్ కొంత కాలం గల్ఫ్ వెళ్లి వచ్చాడు. తిరిగి గల్ఫ్‌కు వెళ్లాల్సిన సందీప్ జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో గొడవ జరగడంతో తీవ్ర మనస్థాపానికి గురై సందీప్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసుల వివరించారు.

Comments

comments

Related Stories: