ఉరివేసుకొని యువతి ఆత్మహత్య

సింగరేణి : ఉరివేసుకొని యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం రాత్రి షిర్కేలోని ఎన్‌టి2-3168 క్వార్టర్‌లో 8వ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. సింగరేణి సంస్థ ఆర్‌జి2 డివిజన్‌లో కార్మికునిగా పనిచేస్తున్న చెన్న లింగయ్య కుమార్తె చెన్నె రజిత (22) రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. షిర్కేలోని ఎన్‌టి2-3168 క్వార్టర్‌లో ఉంటున్న రజితకు ఇటీవలనే నిశ్చితార్థం జరిగింది. మరో నెల రోజుల్లో వివాహం జరుగాల్సి ఉండగా […]

సింగరేణి : ఉరివేసుకొని యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం రాత్రి షిర్కేలోని ఎన్‌టి2-3168 క్వార్టర్‌లో 8వ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. సింగరేణి సంస్థ ఆర్‌జి2 డివిజన్‌లో కార్మికునిగా పనిచేస్తున్న చెన్న లింగయ్య కుమార్తె చెన్నె రజిత (22) రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. షిర్కేలోని ఎన్‌టి2-3168 క్వార్టర్‌లో ఉంటున్న రజితకు ఇటీవలనే నిశ్చితార్థం జరిగింది. మరో నెల రోజుల్లో వివాహం జరుగాల్సి ఉండగా ఆత్మహత్య చేసుకోవడం ఇంటిల్లిపాదిని విషాదంలోకి నెట్టింది. లింగయ్యకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇద్దరికి వివాహం జరిగింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదని గోదావరిఖని టూటౌన్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 15 రోజుల క్రితం ఇదే బ్లాకులో 10వ తరగతి చదువుతున్న చిన్నారి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే మరో యువతి ఆత్మహత్య చేసుకోవడం ఈ ప్రాంతంలో కలకలం రేపింది.

Comments

comments