మంచిర్యాల: తండూర్ మండలం పరిధిలోని మాదారంటౌన్ షిప్‌కు చెందిన అందె సూర్య అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మాదారం పోలీసు స్టేషన్ లో చోటుచేసుకుంది. సూర్య తల్లిదండ్రులు సొంత గ్రామానికి పని నిమిత్తం వెళ్లగా తమ్ముడు, అన్న హైదరాబాద్‌లో ఉండగా ఇంట్లో ఒక్కడే ఉన్నట్లు స్నేహితులు తెలిపారు. మంగళవారం స్నేహితులతో గడిపిన సూర్య బుధవారం సాయంత్రం వరకు కనింపకపోవడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా దూలానికి ఉరివేసుకున్నట్టు కనిపించాడు. వెంటనే కుటుంబీకులకు సమాచారం అందించగా సూర్య మృతికి గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు మాదారం ఎస్ఐ భీమయ్య తెలిపారు.