ఉప్పొంగిన భక్తిభావం

Greatly the first Ekadasi Paradise Day

సాగర్‌లో పోటేత్తిన భక్తులు

ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు
పుణ్యాస్నానాలు ఆచరించిన భక్తులు
భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు

మన తెలంగాణ/ నాగార్జునసాగర్ : తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని సోమవారం నాగార్జునసాగర్‌లోని కృష్ణానది స్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులతో స్నానఘాట్లు రద్ధీగా మారాయి. సోమవారం తెల్లవారు జాము నుండే ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శివాలయం పుష్కరఘాటు వద్ద ఉదయం నుండి రాత్రివరకు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయ అర్చ కులు సుధాకర్‌శాస్త్రీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గీతామందిరం వద్ద గీతాయాగం నిర్వహించారు. సురికి వీరాంజనేయస్వామి ఆలయంలో అర్చకులు శ్రీపాదశాస్త్రీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రామాలయం, క న్యకాపరమేశ్వరి దేవాలయం, ఏలేశ్వర ఆలయం, సత్య నారాయణ స్వామి దేవాలయంల వద్ద భక్తుల రద్ధీ ఎక్కువగా ఉంది. వేల సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఇక్కడ ఎలాంటి అవంతరాలు జరగకుండా సాగర్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన భ ద్రత ను ఏర్పా టు చేశారు. శివాలయం, ఏ లే శ్వరా ఆలయాల వద్ధ ప్రత్యేకంగా మిటా యి, బొమ్మల కొట్లు వెలిసాయి.

ఆలయాలలో భక్తుల కిటకిట
తొలి ఏకాదశి పర్వదినాన్ని హుజూర్ నగర్ పట్ట ణంలో భక్తులు ఘనంగా జ రుపుకు న్నారు. సో మ వారం నాడు తొలి ఏకాదశి కావడంతో పట్టణంలోని ఏకాదశి పర్వదినం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీ వేణుగోపాల సీతారామచంద్రస్వామి దేవాలయం, శ్రీస్వయంభు శంభులింగేశ్వరస్వామి దేవాలయం, శ్రీగోదా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి దేవాలయం, శ్రీకనక దుర్గమ్మ దే వాలయం, శ్రీశిరిడి సాయి బాబా దేవాలయం, శ్రీ అభయాంజనేయస్వామి దేవా యలం, శ్రీ జ్ఞా నసరస్వతి దేవాలయాలు భక్తులతో కిటకిట లా డాయి. క్యూ లైన్లలో దేవుళ్ళను దర్శించుకు నేం దుకు భక్తులు బారులు తీరారు. మహిళలు ప్రత్యేక భక్తి శ్రద్దలతో దీపారాదనలు చేశారు.

ఉప్పొంగిన భక్తిభావం
దామరచర్లలో: తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మం డలంలోని వాడపల్లి ఆలయాలు జిల్లాతోపాటు గుంటూరు జిల్లా నుంచి వచ్చిన భక్తులతో కిటకిట లాడాయి. దైవ ద ర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. వాడ పల్లి శివారులోగల కృష్ణా-మూసీ సంగమంలో పుణ్య స్నా నాలు ఆచరించారు. శ్రీమీనా క్షీఅ గస్తేశ్వరస్వామి, శ్రీలక్ష్మీ నర్సి ంహ్మస్వామి ఆలయాల్లో భక్తు లు ప్రత్యేక పూజలు, అర్చన లు, అభిషేకాలు నిర్వహిం చా రు. శివాలయంలోని నాగేం ద్రుని పుట్ట, కృష్ణవేణి అమ్మ వా రి వద్ద మహిళా భక్తులు పూజలు నిర్వహించి తమ మొ క్కులు తీర్చు కున్నారు. దైవ దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగ కు ండా దేవస్థానం వారు ఏర్పాట్లు చే శారు. కార్య క్రమంలో దేవాలయల చైర్మన్ కొందూటి సిద్ద య్య, మేనే జర్ మృత్యుంజశాస్త్రి, పుజారులు పాల్గొన్నారు.

చెర్వుగట్టులో ఎమ్మెల్యే ప్రత్యేకపూజలు
నార్కట్‌పల్లిలో: తొలి ఏకాదశి పర్వదిన్నాని పురుస్కరించుకొని ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు సోమవారం చేర్వు గట్టులో పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లడుతూ తెలంగాణ లో చెర్వుగట్టు ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్ర ంగా విరాజిల్లుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్ర ముఖ శివక్షేత్రంగా అభివృద్ది చేయడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. సిఎం కేసీఆర్ దేవాలయాల అభివృద్దికి ఎంతో కృషి చేస్తుందని అన్నారు.
ఏకాదశి ప్రత్యేక పూజలు : చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం తొలి ఏకాదశి పర్వదిన్నాని పురుస్కరించుకొని భక్తుల సందడి నెలకొ ంది దేవాలయ అదికారులు స్వామివారిని ప్రత్యేకగా అలంకరించి పూజలు నిర్వహించారు మూడుగుండ్ల దర్శ నం భక్తులు బారు లు తీరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగట్టే మల్లిఖార్జున్‌రెడి సర్పంచ్‌లు మల్గ రమణ బాలకృష్ణ, ఈవో అంజాన రెడ్డి, వోంపు శివ,మేడి శంకర్,వనం శంకర్,లింగాస్వామి గోదల వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments