ఉప్పు నీరు తాగి బాలిక మృతి..

 Girl Died  Drinking salt water
తాండూరు రూరల్‌ః పాలిషింగ్ యూనిట్‌లో వాడే ఉప్పు నీరు సేవించి బాలిక మృతి చెందిన సంఘటన తాండూరు మండల పరిధిలోని అంతారం గ్రామంలో జరిగింది. తాండూరు సిఐ ప్రతాప లింగం తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చెన్‌గెస్ పూర్ గ్రామానికి చెందిన ఎల్లప్ప గత ఎడు నెలలుగా అదే మండలం అంతారం గ్రామానికి చెందిన నర్సిములు పాలిషింగ్ యునిట్‌లో రోజు కూలిగా పని చేస్తున్నారు.అయితే శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మంచి నీళ్లు తాగడానికి వెళ్లిన ఎల్లప్ప కూతురు మల్లేశ్వరి(16) పాలిషింగ్ యునిట్‌లో వాడుకునే ఉప్పునీరు సేవించింది. వెంటనె చికిత్సకోసం జిల్లా  ఆస్పత్రికి తరలించారు. చికిత్స  పొందుతూ మల్లేశ్వరి మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

Comments

comments