ఉప్పల్ లో టెస్టు సమరం

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో విండీస్‌ భారత్ జట్ల మధ్య టెస్టు సమరం జరుగనుంది. భారత్‌లో పర్యటించే విండీస్ జట్టు షెడ్యూల్డ్‌ను బిసిసిఐ ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో విండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. సిరీస్‌లో భాగంగా విండీస్ రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మరో మూడు ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టెస్టు అక్టోబర్ 4 నుంచి రాజ్‌కోట్‌లో జరుగనుంది. రెండో టెస్టు మ్యాచ్‌కు హైదరాబాద్ వేదికగా […]

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో విండీస్‌ భారత్ జట్ల మధ్య టెస్టు సమరం జరుగనుంది. భారత్‌లో పర్యటించే విండీస్ జట్టు షెడ్యూల్డ్‌ను బిసిసిఐ ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో విండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. సిరీస్‌లో భాగంగా విండీస్ రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మరో మూడు ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టెస్టు అక్టోబర్ 4 నుంచి రాజ్‌కోట్‌లో జరుగనుంది. రెండో టెస్టు మ్యాచ్‌కు హైదరాబాద్ వేదికగా నిలువనుంది. అక్టోబర్ 12 నుంచి 16 వరకు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసిన కొద్ది రోజుల్లోనే విండీస్‌తో భారత్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో హైదరాబాద్ వేదికగా ఎంపిక కావడంతో అభిమానులు ఆనందానికి గురవుతున్నారు. తమ అభిమాన క్రికెటర్ల ఆటను తిలకించే అవకాశం వీరికి దక్కనుంది. కాగా, ఈ సిరీస్‌కు టీమిండియా ఎలా సిద్ధమవుతుందో అంతు చిక్కడం లేదు. సుదీర్ఘమైన ఇంగ్లండ్ సిరీస్ ముగిసిన వెంటనే ఆసియాకప్‌లో భారత్ ఆడనుంది. ఆసియా కప్ సెప్టెంబర్ 28న ముగుస్తోంది. ఆ టోర్నీ ముగిసిన వారం రోజుల లోపే విండీస్‌తో సిరీస్‌ను ఏర్పాటు చేశారు. ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా విండీస్‌తో సిరీస్‌ను ఏర్పాటు చేశారు. షెడ్యూల్డ్‌కు సంబంధించిన వివరాలను భారత బోర్డు (బిసిసిఐ) మంగళవారం వెల్లడించింది.

షెడ్యూల్డ్ వివరాలు
టెస్టు సిరీస్
తొలి టెస్టు : అక్టోబర్ 4 నుంచి 8 వరకు రాజ్‌కోట్‌లో
రెండో టెస్టు : అక్టోబర్ 12 నుంచి హైదరాబాద్‌లో
వన్డే సిరీస్
తొలి వన్డే : అక్టోబర్ 21న గౌహతిలో
రెండో వన్డే : అక్టోబర్ 24న ఇండోర్‌లో
మూడో వన్డే : అక్టోబర్ 27న పుణెలో
నాలుగో వన్డే: అక్టోబర్ 29న ముంబయిలో
ఐదో వన్డే : నవంబర్ 1న తిరువనంతపురంలో
టి20 సిరీస్
తొలి టి20: నవంబర్ 4న కోల్‌కతాలో
రెండో టి20: నవంబర్ 6న లక్నోలో
మూడో టి20: నవంబర్ 11న చెన్నైలో