ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల ధర్నా

సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన విద్యార్థులు శుక్రవారం ఉపాధ్యాయులు కావాలని కోరుతూ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. చీర్లవంచ గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, వారి తల్లితండ్రులు శుక్రవారం సిరిసిల్లకు తరలివచ్చారు. కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లితండ్రులు మాట్లాడుతూ చీర్లవంచ ప్రభుత్వ పాఠశాలలో 16 మంది ఉపాధ్యాయులుండగా బదిలీల నేపంతో ఎవరూ పాఠశాలకు రావడం లేదని వారు వివరించారు. విద్యార్థులు మాత్రం రోజూ తరగతులకు వెళ్లి […]

సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన విద్యార్థులు శుక్రవారం ఉపాధ్యాయులు కావాలని కోరుతూ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. చీర్లవంచ గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, వారి తల్లితండ్రులు శుక్రవారం సిరిసిల్లకు తరలివచ్చారు. కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లితండ్రులు మాట్లాడుతూ చీర్లవంచ ప్రభుత్వ పాఠశాలలో 16 మంది ఉపాధ్యాయులుండగా బదిలీల నేపంతో ఎవరూ పాఠశాలకు రావడం లేదని వారు వివరించారు. విద్యార్థులు మాత్రం రోజూ తరగతులకు వెళ్లి పాఠాలు బోధించేవారు లేక తిరిగివస్తున్నారన్నారు. పాఠశాల పరిసరాల్లో భవన నిర్మాణాల కోసం పెద్దపెద్ద గుంతలు తవ్వారని, వాటిలో విద్యార్థులు పడి మృతి చెందితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు నిలదీశారు. చీర్లవంచకు వెంటనే ఉపాధ్యాయులను పంపించాలని వారు జిల్లా కలెక్టర్‌కు, డిఇఒకు వినతిపత్రాలు అందించారు.

Related Stories: