ఉపాధి కోసం ఉచిత శిక్షణ

Free Training for Employment at SIPET

మేడ్చల్ : కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన  సీపెట్‌లో నిరుద్యోగ యువత ఉపాధి కోసం వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఆ సంస్థ డైరెక్టర్ కృష్ణ తెలిపారు. 8వ తరగతి, టెన్త్, ఐటిఐ చదువుతూ ఆర్థికంగా వెనుకబడిన వారు ఈ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తామని, శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజన సదుపాయం కలిపిస్తామని , ఉచితంగా యూనిఫామ్ ఇస్తామని ఆయన చెప్పారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 20వ తేదీ ఉదయం పది గంటలకు చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్-2లోని సీపెట్ కార్యాలయంలో నేరుగా హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9052494757, 9849599133 నంబర్లలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

Free Training for Employment at SIPET