ఉద్యోగాల పేరుతో మోసం

A man who cheated on jobs was arrested

మధిర : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మెసం చెసిన ఘరానా మెసగాడు కారుమంచి సురేష్‌ను అదుపులోకి తిసుకోన్ని అతని వద్ద నుండి డబ్బుల్, బంగారం, మెటర్‌సైకిళ్ళు, లాప్‌టాప్, సెలు పోన్లు స్వాధీనం చెసుకోవటం జరిగిందని వైరా ఎసిపి ప్రసన్న కూమార్ తెలిపారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొణిజర్ల మండలం చిన్నమునగాల గ్రామానికి చెందిన కారుమంచి సురేష్ యంఎస్సి మాధ్స్ చదివి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండటం పెళ్ళి కోసం ఉద్యోగం అవసరం అవటంతో తనకు తానే సిబిఐలో ఉద్యోగం చెస్తున్నట్టు నకీలి కార్డు సృష్టించుకోన్ని ఎస్‌ఐను అంటూ ప్రచారం చేసుకున్నాడు. 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 27మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానన్ని 55 లక్షల 49 వేల రూపాయిలు వసూళ్లు చేశాడని సమాచారం అందిందని తెలిపారు. మధిర మండలం సిరిపురం గ్రామానికి చెందిన తడికమళ్ళ రామకృష్ణ గత నేల 28వ తేదిన కారుమంచి సురేష్ పై మధిర రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటం జరిగిందని దీంతో రూరల్ ఎస్‌ఐ బండారి కిషోర్ కేసు నమోదు చేశారని మధిర సిఐ సిహెచ్ శ్రీధర్ ఆధ్వర్యంలో పూర్తి సమాచారం సేకరించటం జరిగిందని ఉద్యోగాల పేరుతో వసూలు చేసిన డబ్బులలో 20 లక్షలుతో ఇళ్ళు నిర్మాణం చేశాడని విలాసాలకు అలవాటు పడి కోంత డబ్బును ఖర్చు చేయగా మిగిలిన 3 లక్షల నగదు, ముడు మెటర్ సైకిళ్ళు, ల్యాప్‌టాప్, నకీలి నియామక పత్రాలు స్టాంప్‌లు, సెల్‌పోన్లు, బంగారం, ఇంటి పత్రాలు మొత్తం 34 లక్షలు రికవరి చేయటం జరిగిందని తెలిపారు. శుక్రువారం మధిర ఆర్‌వి కాంప్లెక్స్ వద్ద కారుమంచి సురేష్‌ను మధిర సిఐ ఆధ్వర్యంలో అదుపులోకి తిసుకోన్నారని తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన్న పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ విలేకర్ల సమావేశంలో మధిర సిఐ సిహె శ్రీధర్, మధిర రూరల్‌ ఎస్‌ఐ బండారు కిషోర్, సిబ్బంది రాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.