ఉద్యమనేత అధికారంలో ఉండడం మన అదృష్టం

luck that leader of movement is in power

సమైక్య పాలకుల మోచేతి నీళ్లు తాగిన గత పాలకులు
నదీ జలాలను వినియోగించుకోవడంలో విజయం సాధించిన కెసిఆర్ ప్రభుత్వం
ఉద్యమ తాకిడికే తెలంగాణ వచ్చింది
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ :  దశాబ్ద కాలం పాటు తెలంగాణ ప్రత్యేక రా్రష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ఉద్యమనేత రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టమని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ మండలంలోని గుడిపల్లి కేఎల్‌ఐ లిఫ్ట్ 3 వద్ద మొదటి పంప్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి హాజరై ప్రారంభించారు. సమైఖ్య పాలకుల మోచేయి నీరు త్రాగుతూ పాలించడం వల్లే రైతులకు తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యా యం జరిగిందని అన్నారు. ఈ ఆవేదనతోనే రాష్ట్ర ముఖ్య మంత్రి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారిని ఒక్కతాటిపై నడిపి ఉద్యమాన్ని నడిపించారన్నారు. ఉద్యమాలతో కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఆనాటి ఉద్య మ ఫలితంగాతోనే రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తుండడంతో ప్రజలు సుఖ సంతోషాలతో వెలుగొందుతున్నారన్నారు. గతంలో పరిపాలించిన ఇంటి దొంగలు తెలంగాణ మేమే తెచ్చామని, ప్రాజెక్టులు మేమే తెచ్చామని భీరాలు పలకడం సిగ్గు చేటన్నారు. 1984 జూన్ 16న కేఎల్‌ఐ ప్రాజెక్టుకు జీఓను విడుదల చేసిన 1999 వరకు ఎటువంటి పనులు చేపట్టలేదు. 1999 ఎన్నికల ముందు చెరువు కట్టలు కట్టినట్లు కట్టలు వేసి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చారని, తర్వాత ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రక్కన బెట్టి , ఆంద్రలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తుంటే జిల్లా నేతలు అధికారంలో ఉండే మిన్నకుండా ఉన్న నేతలు నేడు ప్రాజెక్టులపై విమర్షలు చేయడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 25 టీఎంసీలు ఉన్న ప్రాజెక్టును 45 టీఎంసీల వరద జలాలను వాడుకునేలా తెలంగాణ ప్రభుత్వం డిజైన్ చేసిందని నీరంజన్‌రెడ్డి అన్నారు. కృష్ణ నది జలాలలో  రావల్సిన నీటిని తెలంగాణ ప్రభుత్వం వాడుకోవడంలో సఫలీకృతమవుతుందన్నారు. ఈఘనత రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌కు రైతుల పట్ల ఉన్న చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. జూలై మాసంలో ఆల్మట్టి నుంచి వచ్చే వరద జలాలను తెలంగాణ భీడు భూములకు పారించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూరు రైతుల జీవితాలలో ఆనందాన్ని నింపడమే ముఖ్య మ్ంరత్రి కేసీఆర్ లక్షమని, ఆలక్షం దిషగా ప్రాజక్టుల వద్ద మంత్రులను, ఎమ్మెల్యేలను నిరంతరం పర్యవేక్షించే విదంగా ప్రోత్సహిస్తున్నారన్నారు. దీని ఫలితంగానే ఈఏడిది రెండుల పంటలకు నీరందించ గలుగుతున్నామన్నారు. రానున్న 2019 ఎన్నికలలో అత్యదిక మెజార్టీతో టీఆర్‌ఎస్‌ను గెలిపించి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని కోరారు. గత వలస పాలకుల పాలనలో ఏ నీటి పారుదల మంత్రి గాని, ఎమ్మెల్యే గాని ప్రాజెక్టులను సందర్శించిన పాపాన పోలేదని  ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, కేఎల్‌ఐ ప్రాజెక్టు వద్ద రేయింబవల్లు ఉండి అధికారులను ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా ప్రోత్సహించాడన్నారు. ఈకార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి జక్కా రఘునందన్ రెడ్డి, ఎంపీపీ బండి శాంతమ్మ, మండల టీఆర్‌ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments