ఉత్సాహంగా పనిచేసేందుకు ఆరు సూత్రాలు

అనవసర విషయాలు తలకెక్కించుకోవడం వల్ల మనం చేసే పని మీద శ్రద్ధ తగ్గుతుంది, అలా కాకుండా ఉండాలంటే కొంత వ్యవస్థీకృతంగా పనిచేయడం అవసరం. దీని వల్ల చేసే పనిలో చురుకుదనం వస్తుంది. ఉత్సాహంగా పనిచేయడం వల్ల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే సరైన ప్రణాళిక ఉంటే పని ఒత్తిడి కూడా తగ్గుతుంది. రేపు చేయాల్సిన పనుల గూర్చి ఈ రోజే ప్రణాళిక వేసుకుంటే ఒత్తిడి లేకుండా, తక్కువ సమయంలో పనిని పూర్తిచేసి, మీకిష్టమైన వారితో మిగతా సమయాన్ని గడపొచ్చు. ప్రణాళికాబద్ధంగా వెళ్లేవారి పనితీరు కూడా బాగుంటుంది. మీ పనితీరును మెరుగుపర్చుకునేందుకు ఈ ఆరు సూత్రాలను పాటించవచ్చు…

Employement-Tips

చేయాల్సిన పనులను, ప్రాధాన్యాన్ని నిర్ణయించుకోవాలి
ఏదైనా పనిని చేయాలనుకున్నప్పుడు దానికి తగ్గట్లుగా ప్రణాళిక వేసుకోవాలి. దాంతో ఏ పని ముందు, ఏది తరవాత చేయాలో స్పష్టత వస్తుంది. ముందే నిర్ణయించుకోవడం వల్ల ఆ పనికోసం ఎవరిమీద ఆధారపడకుండా ఉండవచ్చు. మీరు చేసే పనులను ఎప్పటికప్పుడు పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా పనిచేయడం వల్ల దానిపై పూర్తి అవగాహన వస్తుంది.
ముఖ్య విషయాలను రాసుకోవడం
మనకుండే పని ఒత్తిడి వల్ల చాలా విషయాలు మర్చిపోతుంటాం. ఆలోచన రాగానే కాగితం మీద రాయడం మర్చిపోవద్దు. ఆ పని ముఖ్యమా కాదా అని బేరీజు వేయకుండా రాయాలి. ప్రతీది గుర్తుంటుంది కదా అని వదిలేయడం ఒక్కోసారి క్షమార్హం కాని తప్పుకు దారితీస్తుంది. రాసుకోవడం వల్ల తప్పకుండా పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
ఇంకొకరితో పోలిక వద్దు
ఎవరి పనితీరు వారిదే. ఒకరికి ఒప్పైంది మరొకరికి ఒప్పే కావాల్సిన అవసరం లేదు. మీలోని బలాలు, బలహీనతలు తెలుసుకుని, వేరేవారిలా ఉండాలనుకు నే ప్రయత్నం నుంచి బయటకు రావడం నేర్చుకోవాలి. మీకు నచ్చిందేదో తెలు సుకుని అదే దారిలో పనిచేసు కుంటూ వెళ్లడం అవసరం.
పనిని చిన్నచిన్న విభాగాలుగా విభజించుకోవాలి
ఒక ఎగ్జిక్యూటివ్ సంవత్సరంలో దాదాపు ఆరు వారాలు, కనిపించని ఫైల్స్ వెతికే పనిలో సమయం వృథా చేస్తాడు ( వాల్ స్ట్రీట్ జర్నల్ సర్వే ప్రకారం). అందుకే డివైడ్ అండ్ రూల్ పాలసీ ప్రకారం ఒక పెద్ద పనిని చిన్న చిన్న విభాగాలుగా విభజించుకుంటే, పర్యవేక్షించ డం తేలికవుతుంది. పని విభజన అనేది త్వరగా పని పూర్తవడానికి కారణమవుతుంది.
నిద్రపోయే ముందు రేపటి గురించి ఆలోచించడం
పడుకునే ముందు రేపటి పని గురించి ప్రణాళిక వేసుకోవడం మరవద్దు. పనికి సంబంధించిన వస్తువులను ముందుగానే అమర్చిపెట్టుకోవడం వల్ల రేపటి పనికి ముందుగానే సంసిద్ధులైనట్లవుతుంది. ఈ రకమైన ఆలోచన రేపు చేయబోయే పనికి మిమ్మల్ని మరింత చేరువ చేస్తుంది.
మీకు మీరు శభాష్ అనుకోండి
పని చేస్తున్నప్పుడు ఎవరైనా ప్రోత్సహిస్తే మనకు మరింత ఉత్సాహం వస్తుంది. అలా ఎవరూ చెప్పని సమయంలో ఎవరికి వారు శభాష్ అనుకోవడం మంచిది. మీరు ఎంచుకున్న లక్షం చేరుకోగానే అభినందించు కోవడం మరింత ప్రోత్సాహాన్నిస్తుంది. పని పూర్తి చేయగానే మీ కిష్టమైన స్వీట్ తినడమో లేదా ఓ గంట ఎక్కువ నిద్ర పోవడమో చేయొచ్చు.

Comments

comments