ఉత్తర కొరియాతో చర్చలు సజీవం!

Trump replied to press questions

వాషింగ్టన్: కొరియా ద్పీపకల్పంను అణ్వస్త్రరహితం చేసే ఒప్పందాన్ని పూర్తిచేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రతినబూనారు. ఇందుకోసం ఉత్తరకొరియా నేత కిమ్ జోంగ్‌ఉన్‌తో చర్చించేందుకు సిద్ధమేనన్నారు. చర్చల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడి కొన్ని వారాలైనప్పటికీ చర్చలు ఇంకా సజీవంగానే ఉన్నాయన్నారు. అధ్యక్షుడు ట్రంప్ విషయంలో దృఢమైన విశ్వాసాన్ని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తంచేశారు. దానికి ట్రంప్ టిట్టర్‌లో ‘చైర్మన్ కిమ్‌కు కృతజ్ఞతలు.

మనం కలిసి పనిచేద్దాం’ అని రాశారు. దక్షిణకొరియా ప్రత్యేక దూతతో అణ్వస్త్రరహిత చర్చలు జరిపిన తర్వాత లక్షానికి నిబద్ధులమేనని, చర్చలు తిరిగి మొదలెట్టడానికి సిద్ధమేనని కిమ్ చెప్పిన కొన్ని గంటలకే ట్రంప్ ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 1820 మధ్య ప్యోంగ్యాంగ్‌లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్‌ఉన్, దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జేఇన్ సమావేశం జరగనున్నది. కిమ్‌ను కలుసుకున్న దక్షిణకొరియా జాతీయ భద్రతా సలహాదారు చుంగ్ యుయి-యోంగ్ ‘ట్రంప్ పట్ల ఉన్న విశ్వాసం చెక్కుచెదరలేదని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ అన్నారు’ అని వ్యాఖ్యానించారు.

Comments

comments