ఉత్తర కాశీలో ఘోర ప్రమాదం.. 9మంది మృతి

9 Killed in Road Accident in Uttarakhand

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపుతప్పి జార్జ్ వద్ద లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాదస్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఘటనాస్థలిలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments