ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : 11మంది మృతి

ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్‌లో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11మంది చనిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. చంపావత్ జిల్లా తనక్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. బరేలి జిల్లాకు చెందిన భక్తులు పూర్ణగిరి దైవదర్శనం కోసం కాలినడకన వెళుతున్నారు. తనక్‌పూర్‌లో అతివేగంగా వచ్చిన లారీ వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు. గాయపడిన వారిలో పలువురి […]

ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్‌లో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11మంది చనిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. చంపావత్ జిల్లా తనక్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. బరేలి జిల్లాకు చెందిన భక్తులు పూర్ణగిరి దైవదర్శనం కోసం కాలినడకన వెళుతున్నారు. తనక్‌పూర్‌లో అతివేగంగా వచ్చిన లారీ వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసునమోదు చేసి మృతుల వివరాల గురించి ఆరా తీస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సిఎం త్రివేంద్ర సింగ్ రావత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు.

11 People died in Accident at Uttarakhand

Comments

comments

Related Stories: