ఉత్తమ గ్రామ పంచాయతీగా లింగంపల్లి

అభివృద్ధిలో ముందడుగు
స్వచ్ఛలింగంపల్లిగా తీర్చిదిద్దుతున్న గ్రామస్తులు
120ఇళ్లకు 120మరుగుదొడ్లు
100శాతం ఇంటి పన్ను చెల్లించిన గ్రామం
మండలంలోని ఉత్తమ గ్రామంగా ఆదర్శం

                     Best-Grama-Panchayati

నవాబుపేట: నవాబుపేట మండలంలోనే అభివృద్ధిలో దూసుకుపోతున్న గ్రామం లింగంపల్లి. జూన్2వ తేదీన జిల్లాస్థాయిలో ఉత్తమ గ్రామ పంచా యతీగా అవార్డు దక్కించుకున్న గ్రామం. ఏ గ్రామంలో లేనివిధంగా మొట్టమొదటిసారిగా గ్రామానికి డపింగ్ యార్డు నిర్మించుకున్నారు. గ్రామంలో మొత్తం 120ఇళ్లు ఉంటే ప్రతి ఇంటి దగ్గర 120మరుగుదొడ్లు నిర్మించుకున్న స్వచ్ఛలింగంపల్లిగా పేరుతెచ్చుకుంది. గ్రామంలో ప్రతి నెల 100శాతం ఇంటిపన్ను చెల్లిస్తారు. గ్రామంలోని ప్రజ లు ఎవరి ఇంటి ముందు ఉన్న చెత్తను వారు స్వచ్ఛందగా తొలగిస్తారు. గ్రామంలో ప్రతి వీధిలో సిసిరోడ్లు ఉండ డంతో మురుగుకాలువల్లో చెత్త పడకుండా మురుగునీరు నిల్వకుండా గ్రామస్తులు ఎవరికి వారు శుభ్రం చేసుకోవ డంతో గ్రామం ఎప్పుడూ పరిశుభ్రంగా కనిస్తుంది.

గ్రామం లో మొత్తం 1400మంది జనాభ ఉంటే అందులో 840 మందికి ఓటు హక్కు కలిగి ఉన్నారు. గ్రామంలో 162 మందికి ప్రతి నెల ప్రభుత్వం పింఛన్ అందుతుంది. గ్రామ పంచాయతీ నూతనంగా రూ.13లక్షలతో నిర్మాణం కొన సాగుతోంది. అధికారులు, నాయకులు, గ్రామస్తులు గ్రామాన్ని ఇంత బాగా ఉంచుకోవడం చూసి ప్రతి ఒక్కరు లింగంపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ఉత్తమ గ్రామా లుగా మార్చేందుకు అధికారులు ప్రతి సమావేశంలో లింగంపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ఇలా ఉండా లని ప్రచారం చేస్తుంటారు.

ఎవరో వస్తారని ఏదో చేస్తారని చూడకుంటా గ్రామస్తులు ప్రతిదీ మా పని అనుకొని ఎవరి ఇంటి ముందు వారు. చెత్తను డంపింగ్ యార్డులో వేయ డం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఉండడంతో జిల్లాలోనే లింగంపల్లి గ్రామం ఆదర్శంగా నిలిచింది. ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఇచ్చిన రూ.5లక్షల నిధులతో జెడ్పీ టీసీ రాంరెడ్డి గ్రామంలో విద్యుత్ పోల్స్‌కు వీధిదీపాలు వేయడంతో గ్రామంలో రాత్రి వేళ ఇలాంటి భయాందోళన చెందకుండా ప్రజలు పనులు చేసుకుంటున్నారు. ప్రభు త్వం నుంచి వచ్చే ప్రతి రూపాయిని వృధా చేయకుండా గ్రామంకోసమే ఉపయోగించుకోవడంతో గ్రామాన్ని స్వచ్ఛ లింగంపల్లిగ్రా మార్చుకున్నామని గ్రామస్తులు పేర్కొం టున్నారు.

అవార్డు రావడంతో సంతోషంగా ఉంది : సర్పంచ్

నవాబుపేట మండలంలోనే లింగంపల్లి గ్రామానికి ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసి జిల్లా స్థాయి అవార్డు రావ డం చాల సంతోషంగా ఉందని గ్రామ సర్పంచ్ నర్సిం హులు అన్నారు. గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అభి వృద్ది చేస్తున్నానని దీనికి అధికారులు, నాయకులు సహకా రం వారి ప్రోత్సహంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా సేవ చేయడంలో ఉన్న సంతోషం మరొకటి లేదని ఆయన మాటల్లో తెలిపారు.

అందరి సహకారంతోనే అభివృద్ది : ఎంపీటీసీ పరమేశ్వర్….

ఆదర్శగ్రామంగా అవార్డు రావడం గ్రామంలోని అందరి బాధ్యతని ఎంపీటీసీ పరమేశ్వర్ అన్నారు. గ్రామస్తులు ఏ పని చేయడానికైన సిద్దంగా ఉంటారు. వారి సహకారంతోనే గ్రామాన్ని అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. అభివృద్ది అనేది అందరి సహకారంతోనే వస్తుందన్నారు. ఈ అవార్డు మేము అధికారంలో ఉండగా రావడంతో సంతోషంగా ఉందని తెలిపారు.