ఉత్తమ అవార్డు గ్రహితకు కెటిఆర్ అభినందనలు

Minister KTR Appreciated Best Award Received Man

టేక్మాల్ ఃరాష్ట్రస్థాయి ఉత్తమ సామాజిక సేవా ఆవార్డు పొందిన నవ్యభారతీ యువజన సంఘం అధ్యక్షులు నాయికోటి భాస్కర్‌ను రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు అభినందించారు. హైదరాబాద్‌లోని మైండ్ సైన్స్ ఆఫీసు వద్ద ఆయనను అభినందించిన కెటిఆర్ హరితహారం కార్యక్రమాన్ని మండలంలో విజయవంతం చేసేందుకు కృషి చేయాలని భాస్కర్‌కు సూచించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ… తనకు అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇదే ఉత్సాహంతో ముందుకెళ్తూ హరితహారం కార్యక్రమ విజయవంతానికి కృషి చేస్తానని తెలిపారు.