ఉత్తమ్ తో రహస్య మంతనాలపై దానం స్పందన!

Danam Nagender Clarifies Over Join In congress

హైదరాబాద్: నగరంలోని ఓ హోటల్ లో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాజీ మంత్రి దానం నాగేందర్  రహస్యంగా కలిశారనే వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఇటీవలే  కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, టిఆర్ఎస్ చేరిన దానం కు కెసిఆర్ జలక్ ఇచ్చారు. టిఆర్ఎస్ 105 మంది అభ్యర్థుల తొలి జాబితాలో దానం పేరు లేకపోవడం గమనార్హం. దీంతో, ఆయన అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలోనే మళ్లీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి  సిద్ధమయ్యారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై దానం నాగేందర్ స్పందించారు. ఉత్తమ్ ను తాను కలవలేదని, ఆయనను కలవాల్సిన అవసరం తనకు లేదని దానం  స్పష్టం చేశారు. కెసిఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తను కట్టుబడి ఉంటానని వెల్లడించారు. కొందరు కావాలనే ఇలాంటి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరక్కనే ఇటువంటి దుష్ప్రచారానికి పూనుకుంటోందని ఆయన విమర్శించారు.

Comments

comments