ఉత్తమ్ కి కౌంటర్ ఇచ్చిన కెటిఆర్…

KTR counter to Uttam Kumar Reddy

హైదరాబాద్: అమెరికాలో అంట్లు తోముకునేవాడన్న టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యలపై కెటిఆర్ తన ట్విట్టర్‌ ద్వారా మరోసారి కౌంటర్ ఇచ్చారు. తన ఇంట్లో తాను అంట్లు తోముకుంటే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇంట్లో అంట్లు తోమేవారని తెలియజేస్తూ… తాజాగా మరో ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన ఓ ఆంగ్ల వార్త లింక్ ని తన ట్వీట్ కి జత చేసి ‘డిగ్నిటీ ఆఫ్‌ లేబర్ అంటే ఏంటో మీ లాంటి ఫ్యూడలిస్టులకు తెలియదని కెటిఆర్ తన ట్వీట్ ఖాతాలో పేర్కొన్నారు.

Comments

comments