ఉచ్చులో చిక్కుకున్న కొండ చిలువ…

K

మహబూబ్‌నగర్: ముళ్ల పందుల కోసం అమర్చిన ఉచ్చులో కొండ చిలువ చిక్కుకున్న ఘటన కోయిలకొండ మండలం కొత్లాబాద్ లో జరిగింది. కొత్లాబాద్ గ్రామ సమీపంలోని కొయ్యగుండు దగ్గర ముళ్ల పందుల కోసం 3 రోజుల క్రితం స్థానికులు బిగించిన ఉచ్చులో కొండ చిలువ చిక్కుకుంది. కొండ చిలువ అరుపులు విన్న మేకల కాపరులు అక్కడికి వెళ్లి చూడగా 8 అడుగుల కొండ చిలువ కంట పడింది. వారు తక్షణమే గ్రామస్తులకు తెలియజేయడంతో ఉపసర్పంచ్ బాబు జిల్లా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పిల్లలమర్రి అటవీ శాఖ అధికారులు కొండచిలువను ఉచ్చు నుంచి బయటకు తీసి సంరక్షణ కేంద్రానికి తరలించారు.

Comments

comments