ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రానికి అటల్‌జీ ఇల్లు

గ్వాలియర్: దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి తన స్వస్థలమైన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ నగరంలోని రెండు అంతస్తుల సొంత ఇంటిని కంప్యూటర్ శిక్షణ కేంద్రానికి విరాళంగా ఇచ్చారు. 1997వ సంవత్సరంలో తన తండ్రి కృష్ణాజీ స్మారకార్థం తన ఇంట్లో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంతోపాటు బాలల గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల తన ఇంటిని వాజ్ పేయి ప్రజల కోసం విరాళంగా అందించారని గ్వాలియర్ కు చెందిన ఫోటో జర్నలిస్టు […]

గ్వాలియర్: దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి తన స్వస్థలమైన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ నగరంలోని రెండు అంతస్తుల సొంత ఇంటిని కంప్యూటర్ శిక్షణ కేంద్రానికి విరాళంగా ఇచ్చారు. 1997వ సంవత్సరంలో తన తండ్రి కృష్ణాజీ స్మారకార్థం తన ఇంట్లో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంతోపాటు బాలల గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల తన ఇంటిని వాజ్ పేయి ప్రజల కోసం విరాళంగా అందించారని గ్వాలియర్ కు చెందిన ఫోటో జర్నలిస్టు రవి ఉపాధ్యాయ్ వెల్లడించారు. ఎప్పుడూ ప్రజలు, వారి సమస్యలు, వాటి పరిష్కారాల గురించి ఆలోచించే సంఘజీవి మన అటల్‌జీ.

Comments

comments