ఉగ్ర చర్యలకు జవాబు చెప్పాల్సిందే

బిమ్‌స్టెక్ సదస్సు డిక్లరేషన్ ఖాట్మండూ: ఉగ్రవాదానికి ఊతం ఇచ్చే దేశాలను సం బంధిత చర్యలకు జవాబుదారి చేయాల్సి ఉందని బిమ్‌స్టెక్ స్పష్టం చేసింది. నేపాల్‌లో రెండు రోజుల బిమ్‌స్టెక్ సదస్సు ముగింపు తరువాత ఖాట్మండూ డిక్లరేషన్‌ను శుక్రవారం వెలువరించారు. అంతర్జాతీయ శాంతి భద్రతలకు ఉగ్రవాదం తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోందని, దీనిని అరికట్టేందుకు సమగ్ర చర్యలు తీసుకోవల్సి ఉం దని సభ్యదేశాలు తెలిపాయి. ఉగ్రవాదానికి ఏ విధమైన సాయం అందించినా, వారికి ఆశ్రయం కల్పించినా, నిధులు సమకూర్చినా, అనుచిత […]

బిమ్‌స్టెక్ సదస్సు డిక్లరేషన్

ఖాట్మండూ: ఉగ్రవాదానికి ఊతం ఇచ్చే దేశాలను సం బంధిత చర్యలకు జవాబుదారి చేయాల్సి ఉందని బిమ్‌స్టెక్ స్పష్టం చేసింది. నేపాల్‌లో రెండు రోజుల బిమ్‌స్టెక్ సదస్సు ముగింపు తరువాత ఖాట్మండూ డిక్లరేషన్‌ను శుక్రవారం వెలువరించారు. అంతర్జాతీయ శాంతి భద్రతలకు ఉగ్రవాదం తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోందని, దీనిని అరికట్టేందుకు సమగ్ర చర్యలు తీసుకోవల్సి ఉం దని సభ్యదేశాలు తెలిపాయి. ఉగ్రవాదానికి ఏ విధమైన సాయం అందించినా, వారికి ఆశ్రయం కల్పించినా, నిధులు సమకూర్చినా, అనుచిత రీతిలో వారి ఉద్ధేశాలకు ప్రచారం కల్పించినా అటువంటి దేశాలను ఆయా దేశాలలోని వ్యక్తులను సంస్థలను గుర్తించాలి. ఉగ్రవాద చర్యలకు బాధ్యులను చేయాలని 4వ బిమ్‌స్టెక్ సదస్సు పిలుపు నిచ్చింది. సదస్సుకు ప్రధాని మోడీ ఇతర దేశాల నేతలు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో ఉగ్రవాద దాడులను ఈ సదస్సు తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఏ దేశం ఇందుకు వేదిక అయినా దీనిని అంతా ఖండించాల్సిందేనని పిలుపు నిచ్చారు. ఏ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదనే అంశాన్ని నిర్థిష్టంగా ఈ ప్రకటనలో తెలియచేయలేదు. అయితే భారత్ ఇతర ఇరుగుపొరుగు దేశాలు తరచూ పాకిస్థాన్ ఉగ్రవాద ఆలవాలంగా మారినట్లు విమర్శిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. బిమ్‌స్టెక్ సదస్సు ప్రక్రియ పూర్తి స్థాయిలో సంతృప్తిని ఇచ్చింది. విస్తృత స్థాయిలో ఫలప్రదం అయిందని ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. మొదటి రోజున మౌలిక అంశాలపై దృష్టి సారించాం. తరువాత సంప్రదింపుల ప్రక్రియ ద్వారా వైవిధ్య అంశాలలో బహుముఖ సహకారం పటిష్టత దిశలో స్పందించేందుకు అంకితభావాన్ని చాటుకున్నాం అని వివరించారు. బిమ్‌స్టెక్ ప్రాంతీయ కూటమిలో ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థా య్‌లాండ్, భూటాన్, నేపాల్ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఉగ్రవాద నిర్మూలన ఒక్కటే కాకుండా సభ్యదేశాల మధ్య వివిధ కీలక రంగాలకు సంబంధించి విస్తృత స్థాయి సహకారం ఉండాలని ఈ డిక్లరేషన్‌లో తీర్మానించారు.
బిమ్‌స్టెక్ సారథ్య బాధ్యతలు శ్రీలంకకు
బిమ్‌స్టెక్ తదుపరి సారథ్య బాధ్యతలను శ్రీలంకకు అప్పగించారు. సదస్సు ముగింపు సందర్భంగా ప్రస్తుత సారధ్య దేశం నేపాల్ నుంచి ఈ బాధ్యతలను శ్రీలంక అధ్యక్షులు మైత్రీపాల సిరిసేనకు అప్పగించారు. 5వ బిమ్‌స్టెక్ సదస్సుకు శ్రీలంక ఆతిధ్యం ఇస్తుంది. ఈ సంస్థ బాధ్యతలను స్వీకరిస్తూ మైత్రీపాల మాట్లాడారు. సమ్మిట్‌లో కుదిరిన ఏకాభిప్రాయాన్ని నిర్థిష్ట అజెండాతో ముందుకు తీసుకువెళ్లుతామని తెలిపారు.

Comments

comments