హైదరాబాద్: ఇటీవల గీత గోవిందంతో సూపర్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘నోటా’. తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. మరోసారి తనదైన నటనతో విజయ్ అదరగొట్టాడు. సాధారణ యువకుడిగాను, ముఖ్యమంత్రిగాను విజయ్ సరికొత్తగా కనిపించాడు. ఇక ట్రైలర్లో ‘ఇది ముఖ్యమంత్రి పదవా .. మ్యూజికల్ చైర్ ఆటా?’, ‘ఒక స్టేట్ ఫ్యూచర్ అంతా ఒక స్వామిజీ చేతుల్లోనా?’, ‘ఈ గేమ్ లో నువ్వు చూసే రక్తం నిజం… నీ శత్రువులు నిజం… ఆడటం మొదలు పెట్టావో ఆపడం నీ చేతుల్లో వుండదు… లైఫ్ ఆర్ డెత్’ అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా మెహ్రీన్ కౌర్ నటిస్తోంది. ఇతర ప్రధాన పాత్రల్లో సత్యరాజ్, నాజర్ నటిస్తున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా ‘నోటా’ చిత్రం తెరకెక్కుతోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్న ఈ మూవీని అక్టోబర్ 4న విడుదల చేసేందుకు సన్నహలు చేస్తున్నారు.