ఈ మిశ్రమ వంటకాలు పిల్లలకి హానికరం

ఈ రోజుల్లో వెరైటీ ఆహార పదార్థాలు చేసుకోవటం సులువైపోయింది. టీవీ ఛానల్స్, యూట్యూబ్, ఫేస్‌బుక్ లాంటి మాధ్యమాలు బాగా ఉపయోగపడుతున్నాయి. అనేక రకాల ఆహార పదార్థాలతో రుచికరంగా చేసుకుంటున్నారు. వంటకాలను వివిధ రుచుల్లో ఆస్వాదిస్తున్నారు. అయితే కొన్ని రకాల కాంబినేషన్స్ ఆరోగ్యంపై చెడు ఫలితాల్ని కలిగిస్తాయి. అవేంటో తెలుసుకోండి మరి.. అరటిపండు, పాలలో రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా వున్నాయి. వీటిని విడి విడిగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. రెంటినీ కలిపి పిల్లలకు పెట్టకూడదు. వారిలో ఈ హెవీ […]

ఈ రోజుల్లో వెరైటీ ఆహార పదార్థాలు చేసుకోవటం సులువైపోయింది. టీవీ ఛానల్స్, యూట్యూబ్, ఫేస్‌బుక్ లాంటి మాధ్యమాలు బాగా ఉపయోగపడుతున్నాయి. అనేక రకాల ఆహార పదార్థాలతో రుచికరంగా చేసుకుంటున్నారు. వంటకాలను వివిధ రుచుల్లో ఆస్వాదిస్తున్నారు. అయితే కొన్ని రకాల కాంబినేషన్స్ ఆరోగ్యంపై చెడు ఫలితాల్ని కలిగిస్తాయి. అవేంటో తెలుసుకోండి మరి..

అరటిపండు, పాలలో రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా వున్నాయి. వీటిని విడి విడిగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. రెంటినీ కలిపి పిల్లలకు పెట్టకూడదు. వారిలో ఈ హెవీ కాంబినేషన్‌తో పిల్లలు ఎక్కువగా నిద్ర వస్తుంది. ఈ కాంబినేషన్‌ను ఇవ్వకపోవడమే మంచిది.

1 జీర్ణవ్యవస్థ పనితీరుకు పీచు పదార్థం ఎంతో అవసరం. ఎక్కువగా మాంసం, బంగాళాదుంపలు కలిపి వండుతుంటారు. దీనివల్ల ఈ పదార్థాల్లో పీచు లోపిస్తుంది. ఇవి తిన్న పిల్లలకి అరుగుదల లోపంతో బాధపడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరికి ఈ కాంబినేషన్ పెట్టకూడదు.

2 బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ రెండూ బాగా డీప్ ఫ్రై చేసిన పదార్థాలు. ఇవి పిల్లలకు ఇష్టమైన కాంబినేషన్. ఇవి పిల్లలలో బ్లడ్ షుగర్‌ని తగ్గిస్తాయి. పెద్దవారికి ఫరవాలేదు. పిల్లలకు మాత్రం అసౌకర్యం తలెత్తుతుంది.
3 సోడా, పిజ్జా కలిపి పిల్లలకు తినిపించకూడదు. అది ప్రమాదకరం అని చెపుతున్నారు పోషకాహార నిపుణులు. ఈ కాంబినేషన్‌తో తింటే జీర్ణం చేసే సమయంలో శరీరంలో నిల్వ ఉన్న శక్తిని ఎక్కువగా వినియోగించాల్సి వస్తుంది. పిజ్జా, డ్రింక్‌ను తీసుకోవడం ఈ స్థితిని మరింత దిగజారుస్తుంది. పిల్లలు బ్లోటింగ్ సమస్యను ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది.
4 అలాగే పెరుగు, పండ్లు కలిపి తీసుకుంటే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. వీటివల్ల టాక్సిన్స్ పెరిగి పదేళ్ల పిల్లల ఉదరంలో ఉండే సహాయకారి బ్యాక్టీరియా వృద్ధిని అరికడతాయి. దీంతోసైనస్ కంజెషన్, దగ్గు, జలుబు సమస్యలు వేధిస్తాయి. కొన్ని సమయాలలో అలర్జీ సమస్యలు కూడా రావచ్చు. ఈ రెండు పదార్థాలు తినిపించేటప్పుడు మధ్యలో కనీసం ఒక గంట వ్యవధి పాటించాలి.

Comments

comments

Related Stories: