ఈ చీమ చేసిన పని చూస్తే మతిపోవాల్సిందే..!(వీడియో)

Ant stealing diamond worth of 10 lakhs

చీమలు చూడటానికి చిన్నవిగానే ఉంటాయి. కానీ, కొన్ని సార్లు అవి చేసే పనులే మతి పొగొడుతుంటాయి. అందుకేనేమో పెద్దలు ‘చీమ ఎంతొ చిన్నది.. పనిలొ ఎంతొ మిన్నది.. ముందు చూపు ఉన్నది.. పొదుపులోన మిన్నది..’ అని అన్నారు. అసలు విషయం ఏమిటంటే ఓ చిన్న చీమ ఏకంగా అక్షరాల రూ. 10 లక్షలు విలువ చేసే వజ్రాన్ని ఎత్తుకెళ్లింది. ఈ సంఘటన ఓ జ్యూయలరీలో చోటుచేసుకుంది. ఆ షాపు యజమాని వజ్రాలన్నింటినీ ఓ కాగితంలో వేసి లెక్కించే పనిలో ఉన్నాడు. ఇంతలో ఓ చీమ అక్కడికి వచ్చింది. యజమాని కాగితంపై పెట్టి లెక్కిస్తున్న వజ్రాల్లోంచి ఒకదాన్ని అందుకొని వెళ్లడం ప్రారంభించింది. ఎంతో ఆయాసపడుతూ దాన్ని మోసుకెళ్లడాన్ని గమనించిన యజమాని వెంటనే దాన్ని వీడియో తీసి అంతర్జాలంలో పెట్టాడు. దీంతో ఆ వీడియో కొన్ని గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ చీమ వజ్రాన్ని ఎలా ఎత్తుకెళ్లిందో మీరే చూడండి…

Comments

comments