ఈ ‘చింపాంజీ’కి ఏమయింది?…ఎవరూ నోరుమెదపరేంటి?

అది ఉత్తర కొరియా రాజధాని యాంగ్యాంగ్ లోని ఓ జూ. అక్కడ ఓ చింపాంజీ ప్రశాంతంగా, తనివితీరా సిగిరేట్లు కాలుస్తూ కనిపిస్తుంది. వెంటనే షాక్ కాకండి.. చింపాంజి ఏంటి.. సిగిరేట్లు తాగడమేంటని? ఎందుకంటే.. మీలాగే ఆ జూ కెళ్లిన ప్రతి ఒక్కరు షాకయ్యేవారే. రోజూ ఓ డబ్బా కు తక్కువ కాకుండా సిగిరేట్లు కాలుస్తుందట ఆ చింపాంజీ గారు. ఇక ఈ విషయం ఆనోటా ఈ నోటా పడటంతో ఆ జూ తెగ ఫేమస్ అయిపోయిందట. రోజు […]

అది ఉత్తర కొరియా రాజధాని యాంగ్యాంగ్ లోని ఓ జూ. అక్కడ ఓ చింపాంజీ ప్రశాంతంగా, తనివితీరా సిగిరేట్లు కాలుస్తూ కనిపిస్తుంది. వెంటనే షాక్ కాకండి.. చింపాంజి ఏంటి.. సిగిరేట్లు తాగడమేంటని? ఎందుకంటే.. మీలాగే ఆ జూ కెళ్లిన ప్రతి ఒక్కరు షాకయ్యేవారే.

రోజూ ఓ డబ్బా కు తక్కువ కాకుండా సిగిరేట్లు కాలుస్తుందట ఆ చింపాంజీ గారు. ఇక ఈ విషయం ఆనోటా ఈ నోటా పడటంతో ఆ జూ తెగ ఫేమస్ అయిపోయిందట.

రోజు ఓ డబ్బా సిగిరేట్ ప్యాకెట్, లైటర్ ఇవ్వగానే అదే సిగిరేట్ ను ముట్టించుకుంటుందట. ఒకవేళ లైటర్ లేకపోతే సగం తాగిన సిగిరేట్ ఇస్తే దాంతో ముట్టిచ్చుకుంటుందట ఆ చింపాంజి.

అయితే, దీనికి సిగిరేట్ తాగే అలవాటు ఎవడు నేర్పించాడు రా బాబు అని గునగకండి…దాని ట్రైనరే దానికి స్మోకింగ్ చేయడం నేర్పించాడట. ఆ జూలో ఉన్న ఒక్కో జంతువుకు ఒక్కో టాలెంట్ ఉందట. పర్యాటకులను అట్రాక్ట్ చేయడం కోసం అక్కడ ఉన్న జంతువులకు ఒక్కో విధ్య నేర్పిస్తారట. కాని, ఈ చింపాంజీ స్మోకింగ్ అలవాటుకు అలవాటు పడిన జనం దీన్ని చూడటానికి క్యూ కడుతున్నారట.

Comments

comments

Related Stories: