ఈ ఏడాది చివరలో..

‘ఏమాయ చేసావె, మనం’ సినిమాలతో ప్రేక్షకులను మైమరపించింది అక్కినేని నాగచైతన్య, సమంతల జంట. తెరపై ప్రేమను అద్భుతంగా పండించిన వీరు నిజ జీవితంలోనూ ప్రేమికులుగా మారి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి నటించే సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘రారండోయ్ వేడుక చూడ్దాం’లోనే ఇద్దరూ కలిసి నటిస్తారని ప్రచారం జరిగింది కానీ అది నిజం కాలేదు. అయితే త్వరలోనే వీళ్లిద్దరూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ […]

‘ఏమాయ చేసావె, మనం’ సినిమాలతో ప్రేక్షకులను మైమరపించింది అక్కినేని నాగచైతన్య, సమంతల జంట. తెరపై ప్రేమను అద్భుతంగా పండించిన వీరు నిజ జీవితంలోనూ ప్రేమికులుగా మారి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి నటించే సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘రారండోయ్ వేడుక చూడ్దాం’లోనే ఇద్దరూ కలిసి నటిస్తారని ప్రచారం జరిగింది కానీ అది నిజం కాలేదు. అయితే త్వరలోనే వీళ్లిద్దరూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వలో తెరకెక్కబోయే సినిమాలో చై-సామ్ కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాలో వీళ్లిద్దరూ నిజ జీవితంలోలాగే భార్యభర్తలుగా కనిపించబోతున్నారు. ‘నిన్ను కోరి’ చిత్రంలో చాలా పరిణతితో కూడిన ప్రేమ కథను తీర్చిదిద్దిన శివ… మరోసారి అలాంటి విభిన్నమైన ప్రేమ కథతో రాబోతున్నాడట. పెళ్లి తర్వాత ప్రేమ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. తమ ఇద్దరి కెరీర్‌లోనే ఇది ప్రత్యేకమైన సినిమా అవుతుందని చైతూ చెప్పాడు. అయితే ఈ చిత్రం వెంటనే మొదలయ్యేలా కనిపించడం లేదు. సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు సినిమాలను పూర్తిచేసే పనిలో ఉన్న నాగచైతన్య… దాని తర్వాత తన మావయ్య వెంకటేష్‌తో మల్టీస్టారర్ షూటింగ్‌లో పాల్గొంటాడు. మరోవైపు సమంత చేతిలో ఉన్న కమిట్‌మెంట్లను పూర్తిచేయడానికి కొంత సమయం పడుతుంది. దీంతో ఈ ఏడాది చివరలోనే చైతూ, సమంత సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది.

Related Stories: