ఈ అమ్మాయి ఎవరో తెలిస్తే చెప్పాలంటున్న పోలీసులు!

Missing case filed on chikkadpally police station

హైదరాబాద్:  తన తల్లిదండ్రుల పేరు తన పేరు తప్ప మరేమీ చెప్పలేకపోతున్న ఓ యువతి స్థితి ఇది. దీంతో ఆ యువతి వివరాలను తెలుసుకోవడానికి నగర పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా పై ఫొటోలోని యువతి ఎవరో తెలిస్తే చెప్పాలని హైదరాబాద్ పోలీసులు కోరుతున్నారు. తన మానసిక స్థితి సరిగ్గా లేని పినిశెట్టి మహేశ్వరి (19) ఇంటి నుంచి తప్పిపోయి…. ఆదివారం రాత్రి చిక్కడపల్లి పోలీసుల కంటబడింది. ఆమెను ప్రస్తుతం పోలీసుల రక్షణ భవనంలో ఉంచారు. మహేశ్వరి తన అన్న పేరు, ఆమె తండ్రి రవీంద్ర, తల్లి మాధవి అన్న వివరాలు మినహా ఇంకా ఎటువంటి వివరాలు చెప్పలేకపోయింది. తాను ఎక్కడ ఉంటుందన్న ప్రాంతాన్ని కూడా ఆ యువతి చెప్పడం లేదు. దీంతో మహేశ్వరి ఫొటోను విడుదల చేసిన పోలీసులు, కుటుంబసభ్యల కోసం వాకబు చేస్తున్నారు.